మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అయ్యాక తెలంగాణలో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి ఇప్పుడు మూడవసారి ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుని సాకుగా చూపించి రాజకీయ లబ్ది పొందడం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులకి ప్రస్తుతం అలవాటయింది. తాజా ఎన్నికల్లో కూడా ఈ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యాన్ని వాడుకుంటున్నారు. స్కిల్ స్కాం లో చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేశారు.
Also read:
ఆయన అరెస్టుని తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు కూడా ఖండించాయి కానీ అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. అక్కడక్కడ నాయకులు మాత్రమే స్పందించారు. హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు ఐటి ఉద్యోగులని నియంత్రించేందుకు యజమాన్యాలపై తెలంగాణ సర్కారు ఒత్తడిని పెంచింది. ఆందోళనలు చేపడితే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నారా లోకేష్ మంత్రి కేటీఆర్ కి ఫోన్ చేసి ఆందోళన కార్యక్రమాలకి అనుమతి ఇవ్వాలని అడిగారు అయితే శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని కేటీఆర్ చెప్పేసారట.
ఆందోళనలు నిరసనలు చేపడితే హైదరాబాద్ ఐటి బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పారట ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో కేటీఆర్ వ్యూహాన్ని మార్చారు. ఐటి ఉద్యోగులు సెటిలర్ల ఓట్లకి గండి పడుతుందని మాట మార్చారు. రెండు రోజుల కిందట చంద్రబాబు అరెస్టుపై లోకేష్ చేసిన ట్వీట్ మీద రియాక్ట్ అయ్యారు. లోకేష్ కి సానుభూతి తెలిపారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో బిజెపి మద్దతుతోనే చంద్రబాబుని అరెస్టు చేశారని దేశమంతా అనుకుంటుందని కామెంట్లు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం సరి కాదని పార్టీకి చెందిన నేతలు సానుభూతి వ్యక్తం చేశారు. అయితే వాళ్ళ పార్టీకి తెలుగుదేశం పార్టీలో పలువురుతో సత్సంబంధాలు ఉన్నాయని జగన్, పవన్, లోకేష్ లలో తో మంచి సంబంధాలే కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. కేటీఆర్ కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్న తీరులో చేస్తున్నారు అని అంతా అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ కి కారణం బీజీపీ అని వారి మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.