Telugu News » KTR: మోస‌పూరిత వాగ్దానాలు ఎలా చేస్తారు..? క‌ర్ణాట‌క సీఎంపై కేటీఆర్ సెటైర్లు..!

KTR: మోస‌పూరిత వాగ్దానాలు ఎలా చేస్తారు..? క‌ర్ణాట‌క సీఎంపై కేటీఆర్ సెటైర్లు..!

కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly)లో సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా, ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు.

by Mano
KTR: How do you make fraudulent promises..? KTR satires on Karnataka CM..!

‘ఎన్నికల ప్రచారంలో చెప్పినంత మాత్రాన ఫ్రీ ఇవ్వాలా?’ అని కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly)లో సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

KTR: How do you make fraudulent promises..? KTR satires on Karnataka CM..!

‘డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.. ప్రచారంలో వాగ్దానం చేసింది నిజమే.. కానీ అమలు చేయలేం’ అంటూ సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో చెప్పిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఎన్నిక‌ల వాగ్దానాలు నెర‌వేర్చేందుకు డ‌బ్బులు లేవ‌ని క‌ర్నాట‌క సీఎం అసెంబ్లీ వేదిక‌గా తేల్చి చెప్పారు. ఈ ఆ ప్ర‌సంగానికి సంబంధించిన వీడియోను ‘ఉత్త‌రాంధ్ర నౌ’ అనే సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. అయితే తాజాగా, ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు.

తెలంగాణ భ‌విష్య‌త్తు కూడా ఇలాగే ఉండ‌బోతుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. క‌ప‌ట వాగ్దానాల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆయ‌న ఆరోపించారు. ఏమాత్రం ప‌రిశోధ‌న చేయ‌కుండా మోస‌పూరిత వాగ్దానాల‌ను ఎలా ఇస్తార‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ఎలాంటి ప్రణాళిక లేకుండానే విప‌రీత‌మైన ప్ర‌క‌ట‌న‌లు ఎలా చేస్తార‌ని కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారని హామీలు ఇచ్చే ముందు ఆలోచన చేయరా? అంటూ కేటీఆర్ x ఖాతాలో పేర్కొన్నారు.

You may also like

Leave a Comment