Telugu News » KTR-Nirmal : ఇవాళ నిర్మల్ లో కేటీఆర్ ఏం చేయనున్నారంటే…

KTR-Nirmal : ఇవాళ నిర్మల్ లో కేటీఆర్ ఏం చేయనున్నారంటే…

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు విస్తృత పర్యటనలు, ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తోంది.

by Prasanna
KTR

నిర్మల్ (Nirmal) జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) లో భాగంగా రూ. 714 కోట్లతో చేపట్టిన ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప్రారంభించిన తర్వాత సోన్ మండలం పాత పోచంపాడులో 40 ఎక‌రాల విస్తీర్ణంలో ఆయిల్‌ఫామ్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాప‌న చేయనున్నారు. నిర్మల్‌ పట్టణంలో రూ. 10.15  కోట్లతో ఏర్పాటు చేయనున్న మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాప‌న చేయనున్నారు.

KTR

రూ. 2 కోట్లతో దోబీఘాట్ నిర్మాణానికి, రూ. 62.50 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరిచేందుకు అమృత పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసే బ‌హిరంగ సభలో పాల్గొంటారు. కేటీఅర్ పర్యటన ఎర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు విస్తృత పర్యటనలు, ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తోంది. అభ్యర్థులు ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు.  ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీబిజీగా గడుపుతున్నారు.


జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పట్టణ సీఐ పురుషోత్తం తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం బహిరంగసభ ఉన్నందున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2. 30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. బైంసా వైపు నుండి వచ్చే ప్రజలు తల్వేద గ్రామం మీదగా గాజులపేట్ ద్వారా పట్టణానికి చేరుకోవాలని, మిగతా రూట్స్ వారు శివాజీ చౌక్ నుండి కాకుండా వేరే రూట్ లో రావాలన్నారు.

You may also like

Leave a Comment