సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే 15 మంది డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నా స్పందించరా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వీటిని కూడా చదవండి: Gadala Srinivasa Rao : కాంగ్రెస్ గూటికి గడల…. ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్….!
ప్రజా పాలన తీసుకు వస్తామని చెప్పి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా వ్యతిరేకిగా మారిపోయిందని నిప్పులు చెరిగారు.
గత పదేండ్ల తెలంగాణలో అన్ని వర్గాలు ఆనందంగా ఉంటే.. కేవలం మీ ప్రభుత్వ 55 రోజుల పరిపాలనలో ఎన్నో వర్గాలు ఆగమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ఆటో డ్రైవర్లు మీ ప్రభుత్వం వల్ల రోడ్డున పడ్డారని ఫైర్ అయ్యారు.
వీటిని కూడా చదవండి: PM Modi : మూడవ సారి అధికారంలోకి వచ్చాక….మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం…!
ఇంతకాలం ఆటో డ్రైవర్లు చెమటోడ్చి తమ కుటుంబాలను పోషించుకున్నారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ఏకంగా 15 మంది ఆటోడ్రైవర్లు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతోందన్నారు. అందువల్ల వెంటనే ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాధిత డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆటో డ్రైవర్లకు ప్రతినెలా రూ. 10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు.
వీటిని కూడా చదవండి: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్…. పోలీసుల ఉద్యోగాలపై కీలక ప్రకటన…!