Telugu News » KU Bandh: పీహెచ్డీ ప్రవేశాల్లో అవకతవకాలపై కేయూ బంద్

KU Bandh: పీహెచ్డీ ప్రవేశాల్లో అవకతవకాలపై కేయూ బంద్

సాధారణంగా కేటగిరీ-1 కింద సెట్, నెట్ తో  పాటు ఎంఫిల్ ఉన్న వారు నేరుగా పీహెచ్డీ సీట్లు పొందుతున్నారు. కేటగిరీ-2లో ప్రవేశ పరీక్ష రాసిన వారికి రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంది.

by Prasanna
ku bandh

కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి ఐకాస బంద్ కు పిలుపునిచ్చింది. కేయూ నుంచి విద్యార్థులు బైక్ ర్యాలీ చేపట్టగా…పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ku bandh

సాధారణంగా కేటగిరీ-1 కింద సెట్, నెట్ తో  పాటు ఎంఫిల్ ఉన్న వారు నేరుగా పీహెచ్డీ సీట్లు పొందుతున్నారు. కేటగిరీ-2లో ప్రవేశ పరీక్ష రాసిన వారికి రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే రెండో కేటగిరీలో పైరవీలతో సీట్లు కట్టబెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

పీహెచ్డీ సీట్ల భర్తీలో ప్రధానంగా పారదర్శకత లోపిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల తర్వాత గతేడాది 212 సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదలైతే, అందులో కూడా పార్ట్ టైం రిసెర్చర్లకు పెద్ద సంఖ్యలో సీట్లు కేటాయించారని విద్యార్థులు ఆరోపించారు. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో ఎటువంటి నిబంధనలు పాటించలేదన్నారు. మరో సారి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బంద్ కు ముందు పోలీసుల సమక్షంలో వీసీ ఇతర అధికారులతో విద్యార్థులు, ఐకాస ప్రతినిధులు చర్చించినప్పటికీ స్పష్టమైన హామీ రాకపోవడంతో బంద్ కొనసాగించారు. ఈ నేపధ్యంలో కేయూ పరిధిలో కొన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.

You may also like

Leave a Comment