Telugu News » Lokesh : లోకేష్ పై సీఐడీ ప్రశ్నల వర్షం

Lokesh : లోకేష్ పై సీఐడీ ప్రశ్నల వర్షం

పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు? మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా?

by admin
naralokesh1

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుకు సంబంధించి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అడిషనల్ ఎస్పీ శ్రీరామ రాజు ఆధ్వర్యంలోని సీఐడీ బృందం లోకేష్ ను ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు వేశారు అధికారులు.

naralokesh1

పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు? మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా? హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా ఎందుకు మార్చారు? హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది? అని అడిగింది.

2014 జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా? లింగమనేని రమేష్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి? మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరాల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేశారు? చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందా? అంటూ లోకేష్ ను ప్రశ్నించారు అధికారులు.

ఈ కేసులో లోకేష్‌ ను ఏ-14గా పేర్కొంది సీఐడీ. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేసింది. లోకేష్‌ ను సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చింది. హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే, సీఐడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు లోకేష్. వాదనల అనంతరం బుక్స్ కోసం ఒత్తిడి చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కానీ, విచారణకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో కొన్ని షరతులు కూడా పెట్టింది. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు లోకేష్ ను ప్రశ్నిస్తున్నారు.

You may also like

Leave a Comment