మధ్యప్రదేశ్ హోం మంత్రి (Home Minister) నరోత్తం మిశ్రా (Narotham Mishra) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ హేమ మాలిని పేరును ప్రస్తావిస్తూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు, మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. సొంత పార్టీ నేతలను కూడా మంత్రి విడిచి పెట్టడం లేదంటూ విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.
దతియాలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి నరోత్తం మిశ్రా మాట్లాడుతూ…. దాంతియాలో తాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. దాంతియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాదని, నియోజ వర్గంలో హేమ మాలిని కూడా డ్యాన్స్ చేసే స్ధాయిలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.
మిశ్రా వ్యాఖ్యలపై జనతా దళ్ యునైటెడ్ (JDU)నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సొంత పార్టీ నేత హేమ మాలినిపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత నరోత్తం మిశ్రా దిగజారుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు. బీజేపీ నేతల సిగ్గు మాలిని చర్యలకు ఇది ఒక ఉదాహరణ అని మండి పడ్డారు.
ప్రకటనపై జేడీయూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా తన సొంత పార్టీ ఎంపీ హేమ మాలినీపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతల సిగ్గుమాలిన వ్యవహర శైలి బయటపడుతున్నదని పేర్కొంది. దాంతియాల్ నరోత్తమ్ మిశ్రా హ్యాట్రిక్ కొట్టారు.
2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దతియా నియోజక వర్గం నుంచి నాల్గవ సారి పోటీ చేస్తున్నారు. ఈ స్ధానం నుంచి ఆయనకు పోటీగా సీనియర్ నేత రాజేంద్ర భారతిని కాంగ్రెస్ బరిలోకి దించింది.