Telugu News » Mynampally : బీఆర్ఎస్ బీటలు… హరీష్ రావుపై రెచ్చిపోయిన మైనంపల్లి!

Mynampally : బీఆర్ఎస్ బీటలు… హరీష్ రావుపై రెచ్చిపోయిన మైనంపల్లి!

మెదక్ లో మంత్రి హరీష్ రావు పెత్తనం ఏంటని ప్రశ్నించారు మైనంపల్లి. జిల్లాలో మంత్రి నియంతగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు.

by admin
malkajgiri-mla-mynampally-hanumantha-rao-strong-warning-to-harish-rao

బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు ఎక్కువవుతున్నాయి. టికెట్ల విషయంలో నేతలు తాడోపేడో అన్నట్టుగానే ఉన్నారు. తాజాగా మల్కాజ్‌ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmatrao) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీష్ రావు (Harish Rao) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైనంపల్లి.. బీఆర్‌ఎస్ (BRS) టికెట్ల గురించి కీలక వ్వాఖ్యలు చేశారు.

malkajgiri-mla-mynampally-hanumantha-rao-strong-warning-to-harish-rao

మెదక్‌ (Medak) లో మంత్రి హరీష్ రావు పెత్తనం ఏంటని ప్రశ్నించారు మైనంపల్లి. జిల్లాలో మంత్రి నియంతగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. సిద్దిపేట (Siddipet) మాదిరిగా మెదక్‌ ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. జిల్లాను అభివృద్ధి కాకుండా చేశారని ఆరోపించారు. తన కుమారుడిని మెదక్ ఎమ్మెల్యే చేయడమే లక్ష్యంగా ఉన్నానన్న ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి తన కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

మెదక్, మల్కాజ్‌ గిరి టిక్కెట్లు ఇస్తేనే బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తామని.. లేదంటే ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతామన్నారు మైనంపల్లి. కరోనా సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడని.. దాదాపు రూ.8 కోట్ల వరకు సొంత డబ్బు ఖర్చు చేశాడని వివరించారు. తాము అనుకున్నట్టు జరగకపోతే.. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ రావు అడ్రస్‌ గల్లంతు చేస్తానని హెచ్చరించారు మైనంపల్లి. తాను బీఆర్‌ఎస్‌ లోనే ఉన్నానని.. టికెట్‌ కూడా డిక్లేర్‌ చేశారని తెలిపారు.

చాలాకాలంగా మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి కుమారుడు రోహిత్ (Rohit) విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు టికెట్ వస్తుందని హన్మంతరావు ఆశించారు. చివరి నిమిషంలో మెదక్ స్థానం నుంచి పద్మా దేవేందర్ (Padma Devender) పేరు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మైనంపల్లి ఇలా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.

You may also like

Leave a Comment