పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా(BJP President Jp Nadda) పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Cm Mamatha Benarji)పై తీవ్రంగా మండిపడ్డారు. మమతా బెంగాల్‌ను సర్వనాశనం చేసిందన్నారు. బెంగాల్లోని సందేశ్ ఖాలీ(Sandesh Khali)లో విదేశీ మరణాయుధాలు, మందు గుండు సామగ్రి సీబీఐ అధికారుల సోదాల్లో బటయపడిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. టీఎంసీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో అరాచకపు పాలనను కొనసాగిస్తోందన్నారు. బెంగాల్లో మహిళ గౌరవాన్ని కాపాడేందుకు వెళ్లిన దర్యాప్తు సంస్థలపై దాడి జగిందని గుర్తుచేశారు.
అంతేకాకుండా సందేశ్ ఖాలీలో జరిపిన సోదాల్లో విదేశీ రివాల్వర్లు, బుల్లెట్లు, క్యాట్రిడ్జ్‌లను సీబీఐ స్వాధీనం చేసుకుందని, దీనిని బట్టి చూస్తే బెంగాల్లో రాజ్యాంగ బద్ధమైన పాలన సాగడం లేదన్నారు. బెంగాల్లో రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందని జేపీ నడ్డా ఆశాభవం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని కాపాడుకుంటామని తెలిపారు. 35 ఎంపీ స్థానాలు తప్పకుండా బీజేపీ ఖాతాలో పడతాయని నడ్డా ధీమా వ్యక్తంచేశారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీని అరెస్టు చేసి, టీఎంసీ పార్టీని నిషేధించాలని మేదినీపూర్ బీజేపీ క్యాండిడేట్ అగ్నిమిత్ర పాల్ డిమాండ్ చేశారు.