Telugu News » MAOISTS : ఛత్తీస్‌గఢ్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. తెలంగాణలో బోర్డర్‌లో హైఅలర్ట్!

MAOISTS : ఛత్తీస్‌గఢ్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. తెలంగాణలో బోర్డర్‌లో హైఅలర్ట్!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ (Beejapur) జిల్లాలోని గ్రామలేంద్ర అటవీ ప్రాంతంలో మంగళవారం భారీ ఎన్ కౌంటర్ (Encounter) జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలు, మావోయిస్టులు (Maoists) పరస్పరం తారసపడి కాల్పులు జరుపుకోగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది మావోయిస్టులు(13 Members died) మృతి చెందారు.

by Sai
Maoists' call for Chhattisgarh bandh.. High alert on the border in Telangana!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ (Beejapur) జిల్లాలోని గ్రామలేంద్ర అటవీ ప్రాంతంలో మంగళవారం భారీ ఎన్ కౌంటర్ (Encounter) జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలు, మావోయిస్టులు (Maoists) పరస్పరం తారసపడి కాల్పులు జరుపుకోగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది మావోయిస్టులు(13 Members died) మృతి చెందారు.ఈ ఘటనపై మావోయిస్టులు దళాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Maoists' call for Chhattisgarh bandh.. High alert on the border in Telangana!

ఈ క్రమంలోనే బుధవారం ఛత్తీస్ గఢ్ బంద్‌కు పిలుపునిచ్చాయి. మావోయిస్టుల బంద్ (Maoists call) పిలుపు నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌‌గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యం ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురంలో ముమ్మరంగా సోదాలు జరుపుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ భారీగా గస్తీ పెంచినట్లు తెలుస్తోంది.

బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. సరిహద్దు ప్రాంతాల్లో భారీగా తనిఖీలు చేపడుతున్నారు.అయితే, మావోయిస్టులతో శాంతి చర్చలకు సిద్ధం అంటూనే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నెత్తుటేర్లను పారిస్తోందని మావోయిస్టుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాంతి చర్చల పేరిట దొంగ దెబ్బ తీయడం సరికాదని పలువురు రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు.

ఇదిలాఉండగా ఛత్తీస్ గఢ్‌లో కొత్తగా బీజేపీ సర్కార్ కొలువుదీరాక ప్రభుత్వం మావోయిస్టులను శాంతిచర్చలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.అందుకు మావోయిస్టులకు కూడా తొలుత ఓకే చెప్పి కండీషన్స్ పెట్టడంతో అవి ముందుకు సాగలేదు.

 

You may also like

Leave a Comment