ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్(Bijapur) దండకారణ్యంలో మరోసారి భారీ ఎన్ కౌంటర్(ENCOUNTER) జరిగినట్లు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా పార్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు (FOUR MEMBERS MAOISTS DIED) మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇటీవలి కాలంలో మావోయిస్టులపై పోలీసులు దాడులు పెరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే పార్లమెంట్, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది.
ఎక్కువగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణను రద్దు చేయాలని మావోలు కరపత్రాలను విడుదల చేస్తున్నారు. లేనియెడల పెద్ద ఎత్తున విధ్వంసాలు చేపడుతామని అందులో హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.
గత మార్చిలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏకంగా ఆరుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే తాజాగా మరోనలుగురు మావోలు పోలీసుల కాల్పుల్లో మరణించారు. కాగా, ఇటీవల ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగా.. మావోలతో చర్చలకు తాము సిద్ధమని, అడవి నుంచి బయటకు రావాలని ఆ రాష్ట్ర మంత్రి పిలుపునిచ్చారు. అందుకు మావోలు కూడా షరతులతో కూడిన సమ్మతిని తెలపగా..ఈ క్రమంలోనే ఎన్ కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి.