శ్రీశైలం (srisailam)లో భారీ అగ్నిప్రమాదం (fire accident) చోటు చేసుకుంది. ఎల్ బ్లాక్ సముదాయంలో ఉన్న లలితాంబికా దుకాణంలో బుధవారం ఆర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో 15 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.
శ్రీశైలం దేవస్థానం ఈవో (temple eo) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల వరకూ ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారుల అంచనా. షార్ట్ సర్క్యూట్ (short circuit) కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బుధవారం అర్ధరాత్రి దాటాక ఎల్ బ్లాక్ సముదాయంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి.
అప్రమత్తమైన దేవస్థానం అధికారులు, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు.