Telugu News » Medaram Jatara: దారులన్నీ మేడారం వైపే.. మహాజాతరకు తరలివస్తున్న భక్తులు..!

Medaram Jatara: దారులన్నీ మేడారం వైపే.. మహాజాతరకు తరలివస్తున్న భక్తులు..!

సమ్మక్క-సారక్కకు మొక్కులు చెల్లించుకునేందుకు తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా మేడారం తరలివస్తున్నారు.

by Mano
Medaram Jatara: All roads lead to Medaram.. Devotees flocking to Mahajatara..!

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర(Medaram Jathara) ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇప్పటికే భక్తులు భారీ సంఖ్యలో మహాజాతరకు చేరుకుంటున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు.

Medaram Jatara: All roads lead to Medaram.. Devotees flocking to Mahajatara..!

సమ్మక్క-సారక్కకు మొక్కులు చెల్లించుకునేందుకు తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా మేడారం తరలివస్తున్నారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ ఇవాళ మొదలైంది.

గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లారబోస్తూ జంపన్నను సాగనంపారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు, మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొస్తారు.

సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి 8 గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలెబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంటిలో పూజా సామగ్రిని శుద్ధిచేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు, కర్రకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.

You may also like

Leave a Comment