Telugu News » Michaung Cyclone: తెలంగాణకు తుపాను గండం.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి..!

Michaung Cyclone: తెలంగాణకు తుపాను గండం.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి..!

తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాలకూ మిచాంగ్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మిచౌంగ్ తుఫాన్ తీరం దాటినప్పటికీ తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

by Mano
Michaung Cyclone: ​​Cyclone Gandam for Telangana.. Coal production stopped..!

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను(Michaung Cyclone)తో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాలకూ మిచాంగ్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Michaung Cyclone: ​​Cyclone Gandam for Telangana.. Coal production stopped..!

మిచౌంగ్ తుఫాన్ తీరం దాటినప్పటికీ తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలహీనపడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ వాయుగుండంగా ఖమ్మంకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో మరింత బలహీన పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రెండు రోజులుగా ఇల్లందు సింగరేణి ఏరియాల్లో ఎడ తెరిపిలేని వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

కోయగూడెం ఉపరితల గనిలో 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయింది. సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. జేవీఆర్ ఓసీలో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. లక్ష 80 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు అంతరాయం. ఈ వర్షానికి వరితో పాటు పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిళ్లడంతో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు.

You may also like

Leave a Comment