Telugu News » MIG-29 : శ్రీనగర్ లో మిగ్ 29 మోహరింపు.. ఏం జరుగుతోంది..?

MIG-29 : శ్రీనగర్ లో మిగ్ 29 మోహరింపు.. ఏం జరుగుతోంది..?

మిగ్‌-21తో పోలిస్తే మిగ్‌-29తో మామూలుగా ఉండదు. ఇది దీర్ఘ శ్రేణి ఎయిర్‌-టు-ఎయిర్‌ మిస్సైల్స్​, ఎయిర్‌-టు-గ్రౌండ్‌ క్షిపణులను మోసుకెళ్తుంది.

by admin

చైనా (China), పాక్ (Pakistan) లతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత వాయుసేన కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్ (Srinagar) ఎయిర్ బేస్ లో అప్ గ్రేడ్ చేసిన మిగ్-29 ఫైటర్ జెట్లను సిద్ధంగా ఉంచింది. ఇప్పటిదాకా మిగ్-21 (MIG-21) ను వాడిన వాయుసేన ఇప్పుడు వాటిస్థానంలో మిగ్-29 (MIG-29) ను రంగంలోకి దింపింది. వాయుసేన నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి నిర్ణయం అని చెబుతున్నారు.

MiG-29 fighter jets replace MiG-21 aircraft at Srinagar air base 1

భారత వైమానిక దళ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లోయ మధ్యలో శ్రీనగర్ ఉందని.. మైదానాల కంటే ఎత్తులో ఉంటుందని తెలిపారు. సరిహద్దుకు సమీపంలో ఉన్నందున ఎక్కువ బరువు సామర్థ్యం నిష్పత్తి.. దీర్ఘశ్రేణి క్షిపణులు, ఆయుధాలతో వేగంగా ప్రతిస్పందించే విమానాన్ని ఉంచడం వ్యూహాత్మకంగా ఉత్తమమని తెలిపారు. మిగ్-29 ఈ ప్రమాణాలన్నింటినీ నెరవేరుస్తుందన్నారు. దీని సాయంతో తాము రెండువైపుల నుంచి శత్రువులను ఎదుర్కోగలమని వివరించారు.

మిగ్‌-21తో పోలిస్తే మిగ్‌-29తో మామూలుగా ఉండదు. ఇది దీర్ఘ శ్రేణి ఎయిర్‌-టు-ఎయిర్‌ మిస్సైల్స్​, ఎయిర్‌-టు-గ్రౌండ్‌ క్షిపణులను మోసుకెళ్తుంది. ఇందులో ఉండే నైట్‌ విజన్‌ గాగుల్స్‌ ఫీచర్‌ తో.. చిమ్మచీకట్లోనూ ఉపయోగించొచ్చు. ఇక గాల్లోనే ఇంధనం నింపే సామర్థ్యం దీని సొంతం. దీనివల్ల, సుదీర్ఘ దూరానికి కూడా పంపించవచ్చు. ఈ ఏడాది జనవరిలోనే వీటిని శ్రీనగర్‌ ఎయిర్‌ బేస్‌ కు తరలించారు. తాజాగా విధుల్లోకి మోహరించారు. సరిహద్దుల్లో శత్రుదేశాల నుంచి ముప్పు ఎదురైనప్పుడు.. ఫస్ట్‌ రెస్పాండర్స్‌ గా ఈ మిగ్‌ ఫైటర్ జెట్ ​లను వినియోగిస్తారు.

You may also like

Leave a Comment