Telugu News » Ambati Rambabu : చంద్రబాబు సీన్ అయిపోయింది!

Ambati Rambabu : చంద్రబాబు సీన్ అయిపోయింది!

బాబు జైలుకెళ్లిన తర్వాత సింపతీ వస్తుందని టీడీపీ వాళ్లు భావించారని.. కానీ, అది రివర్స్ అయిందని విమర్శించారు రాంబాబు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినవారిని, దోచుకున్నవారిని జైలులో పెడితే సింపతీ రాదని సెటైర్లు వేశారు.

by admin
Ambati Rambabu

చంద్రబాబు (Chandrababu) అరెస్ట్, లోకేష్ విచారణ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ (YCP) నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. చంద్రబాబు రాజకీయ జీవితం ఖతం అయిపోయిందని అన్నారు. ఆయనకు రాజకీయ భవిష్యత్ లేదని, మరోసారి ముఖ్యమంత్రి కావడం అసంభవం అని చెప్పారు. చంద్రబాబుపై కేసులు బలంగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదన్నారు. అసలు ప్రజల్లో కూడా ఆయనపై సింపతీ లేదన్నారు.

Ambati Rambabu

బాబు జైలుకెళ్లిన తర్వాత సింపతీ వస్తుందని టీడీపీ వాళ్లు భావించారని.. కానీ, అది రివర్స్ అయిందని విమర్శించారు రాంబాబు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినవారిని, దోచుకున్నవారిని జైలులో పెడితే సింపతీ రాదని సెటైర్లు వేశారు. ఆయన తప్పు చేశారని ప్రజలు నమ్ముతున్నారని.. లోయర్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అవుతున్నాయని.. అంటే ఆధారాలు పక్కాగా ఉన్నాయని తేలిపోయిందన్నారు. చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే పరిస్థితి ఇక్కడి దాకా తెచ్చుకున్నారని వివరించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డే ఏం చేయలేకపోయాడు.. జగన్ ఎంత? అంటూ చంద్రబాబు మాటలకు సమాధానం వచ్చిందన్నారు అంబటి. రెండు పీకి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారంటూ కౌంటర్‌ ఇచ్చారు. టీడీపీ పాలనలో చేసిన దోపిడీ బయట పడిందని.. ఇంత జరిగినా కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు చేయాలంటే మొదటి సంవత్సరమే లెక్క చూసేవాళ్లమని అన్నారు.

టీడీపీ పని అయిపోయిందని గతంలో పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు రాంబాబు. పిల్లిని చంకన పెట్టుకుని పెళ్లికి వెళ్లినట్లు.. టీడీపీ.. జనసేనను కలుపుకుని ఎన్నికలకు వెళ్తోందని సెటైర్లు వేశారు. సీఐడీ విచారణ తర్వాత బయటకొచ్చి నీతి నిజాయితీ గురించి లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించిందని అన్నారు. తండ్రి అరెస్ట్ అయితే లోకేష్ డైపర్ వేసుకుని ఢిల్లీకి పారిపోయారని చురకలంటించారు అంబటి రాంబాబు.

You may also like

Leave a Comment