ఏపీలో రాజకీయాలు(AP Politics) చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార విపక్షాల మధ్య మాటల మిసైల్స్ దూసుకుపోతున్నాయి.
విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana ) మాట్లాడుతూ వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో టీడీపీ, జనసేన కనుమరుగు అవుతాయని జోస్యం చెప్పారు.
అంతే కాదు తన జోస్యం నిజం కాకపోతే గుండు కొట్టించుకుంటానంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రెండు పార్టీల తీరుపై విరుచుకుపడ్డ బొత్స, ఎన్నికలప్పుడే వారికి స్కీములు(schemes), ప్రజలు గుర్తొస్తారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లను దుయ్యబట్టారు.
చేతులు, కాళ్లూ చూపించడం, చెప్పుల కథలు చెప్పడం తప్ప ఆ పార్టీలు చేసేదేం లేదని బొత్స విమర్శించారు. చెప్పులు వాళ్లకే కాదు అందరికీ ఉంటాయంటూ కౌంటరిచ్చారు.
అసలు విధానమంటూ లేని పార్టీ జనసేన అని, పార్టీ పెట్టి 15 ఏళ్లు అయినా తీరూతెన్నూ లేని నాయకుడు పవన్ అని ఎద్దేవా చేసారు. వాలంటీర్లను నోటికొచ్చినట్టు తిట్టి ఇప్పుడు మాట మార్చిన పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడ్డారు. విపక్షాలు చేసే రాజకీయాలు చూస్తే అసహ్యం కలుగుతోందన్నారు బొత్స.