Telugu News » Harish Rao : కొడంగల్ కు రేవంత్ రెడ్డి చేసిందేంటి?

Harish Rao : కొడంగల్ కు రేవంత్ రెడ్డి చేసిందేంటి?

కొడంగల్ కు రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు హరీశ్ రావు. మల్కాజ్ గిరికి పారిపోయిన ఆయన.. అక్కడ కూడా ఏం చేయలేదన్నారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి కృష్ణా జ‌లాలు తీసుకొచ్చి, ఇక్క‌డి రైతుల పాదాల‌ను క‌డుగుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

by admin
Minister Harish Rao warning to TPCC Revanth Reddy

కాంగ్రెస్ (Congress) హయాంలో కొడంగల్ వెనుకబడిందన్నారు మంత్రి హరీశ్ రావు (Harish Rao). కోస్గిలో 50 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో హ‌రీశ్‌ రావు పాల్గొని ప్ర‌సంగించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉంటే ఇంకా పదేళ్లయినా మంచినీళ్లు రాకపోయేవన్నారు. గతంలో మూడు రోజులకోసారి నల్లా వచ్చేదని.. ఇపుడు ప్రతి రోజు నీళ్లు వస్తున్నాయని చెప్పారు. పట్నం నరేందర్ రెడ్డి (Narender Reddy) వచ్చాకే కొడంగల్ (Kodangal) అభివృద్ధి జరిగిందని చెప్పారు.

Minister Harish Rao warning to TPCC Revanth Reddy

కొడంగల్ కు రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు హరీశ్ రావు. మల్కాజ్ గిరికి పారిపోయిన ఆయన.. అక్కడ కూడా ఏం చేయలేదన్నారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి కృష్ణా జ‌లాలు తీసుకొచ్చి, ఇక్క‌డి రైతుల పాదాల‌ను క‌డుగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ల‌క్షా 50 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందిస్తామ‌ని పేర్కొన్నారు. 3 గంటల కరెంట్ కావాలనుకున్న వాళ్లు.. కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని సూచించారు.

కర్ణాటకలో రైతుబంధు, 4 వేల పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణలో ఎలా ఇస్తుందని ప్రశ్నించారు మంత్రి. కాంగ్రెస్ చెప్పే మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దన్నారు. మాటలు కావాలనుకునే వాళ్లు రేవంత్ వైపు.. పనులు కావాలానుకునే వాళ్లు నరేందర్ రెడ్డి వైపు ఉండాలని చెప్పారు. ఎవ‌రెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదని సెటైర్లు వేశారు. హ్యాట్రిక్ సీఎం మ‌న కేసీఆరే అని స్ప‌ష్టం చేశారు.

‘‘రేవంత్ రెడ్డి టీడీపీ డ‌బ్బుల‌తో ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు య‌త్నించి, ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వ‌చ్చిండు. రేవంత్ మీద చ‌ర్య తీసుకోవాల‌ని, విచార‌ణ జ‌ర‌పాల‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయం గెలుస్త‌ది.. ధ‌ర్మం నిల‌బ‌డ‌త‌ది. రేవంత్ త‌ప్పు చేశాడు.. కోర్టులో విచారించాల్సిందేన‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయ‌న‌పై విచార‌ణ అయ్యేది ఖాయం. జైలుకు పోయేది కూడా ఖాయం. కాంగ్రెసోళ్ల మాయ‌మాట‌లు న‌మ్మి ఆగం కావొద్దు’’ అని ప్రజలను కోరారు హ‌రీశ్‌ రావు.

You may also like

Leave a Comment