Telugu News » Komati Reddy Venkat Reddy : అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ బండారం బయటపడుతుంది….!

Komati Reddy Venkat Reddy : అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ బండారం బయటపడుతుంది….!

ఇప్పుడు దోపడి డబ్బును పక్క దారి పట్టిస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ పెద్ద తప్పు చేసి రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచారని మండిపడ్డారు.

by Ramu
https://www.dishadaily.com/telangana/ex-minister-jagdish-reddys-sensational-comments-on-congress-leaders-295618

పదేండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ (KCR) అడ్డంగా దోచుకున్నాడని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ఆరోపించారు. ఇప్పుడు దోపడి డబ్బును పక్క దారి పట్టిస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ పెద్ద తప్పు చేసి రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచారని మండిపడ్డారు. నల్లగొండతో పాటు మరో మూడు జిల్లాలను సర్వనాశనం చేశాడని ఫైర్ అయ్యారు.

https://www.dishadaily.com/telangana/ex-minister-jagdish-reddys-sensational-comments-on-congress-leaders-295618

నల్లగొండలో మీడియాతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…. కేసీఆర్ చేసిన మోసాన్ని తలుచుకుంటే రక్తం మరిగిపోతుందని చెప్పారు. కేసీఆర్ ఇంకా తన ప్రైవేట్ విమానం లీజ్ క్యాన్సిల్ చేసుకోలేదని తెలిపారు. ఎప్పుడంటే అప్పుడు కేసీఆర్ దుబాయ్‌కు పారిపోవచ్చని… అందుకే లీజ్ ఇంకా కొనసాగిస్తున్నారని ఆరోపణలు చేశారు. పనికి రాని వాడికి నల్లగొండ జిల్లాలో మంత్రి పదవి ఇచ్చారని జగదీశ్ రెడ్డిపై విమర్శలు చేశారు.

సూర్యపేటలో తాగేందుకు నీళ్లు లేక పోవడంతో మూసీ నీళ్లు తాగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 4 వేల కోట్లు పెట్టి ఏఎమ్ఆర్పీ ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో 90 శాతం పూర్తైన బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కంటే ముందే ప్రారంభించిన డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు.

కుర్చీ వేసుకుని కూర్చొని ప్రాజెక్టులు కడతామని చెప్పి… పదేళ్లు పట్టించుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు. ఉత్తర తెలంగాణలో మాత్రం అవసరం లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ బండారం బయటపడుతుందన్నారు. ప్రభుత్వంలో కీలకమైన శాఖలన్నీ తన వద్దే పెట్టుకుని కేసీఆర్ దోపిడికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు.

కేసీఆర్ దోపిడికి హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ ఒక ఉదహరణ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు 5 వేల ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఆయన బండారం కూడా బయటపడుతుందన్నారు. త్వరలోనే ఆయనపై కేసులు నమోదు అవుతాయని వెల్లడించారు. దక్షిణ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశాడని ధ్వజమెత్తారు.

మూడు జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వాళ్లు చేసిన పాపాలకే ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ వచ్చి నల్లగొండలో పబ్లిక్ మీటింగ్ పెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడికి వస్తే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పుకు బుద్ధిరాలేదా ఫైర్ అయ్యారు.

You may also like

Leave a Comment