Telugu News » KTR : నిర్ణయం మీదే.. ఎవరు కావాలో డిసైడ్ చేసుకోండి!

KTR : నిర్ణయం మీదే.. ఎవరు కావాలో డిసైడ్ చేసుకోండి!

60 ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్​.. ఇప్పుడు గ్యారెంటీలు అంటూ ఎన్నికలకు వస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అంటే కన్నీళ్లు, కష్టాలు అని, బీఆర్‌ఎస్‌ అంటే సాగునీళ్లు, సంక్షేమం అని చెప్పారు.

by admin
Minister KTR Satires On Congress Party

– రైతు బంధు కేసీఆర్‌ కావాలా?
– రాబందు కాంగ్రెస్‌ కావాలా?
– 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్‌ కావాలా?
– 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్‌ కావాలా?
– ప్రజలు ఆలోచన చేయాలి
– కాంగ్రెస్ గ్యారెంటీలకు వారెంటీ లేదు
– మోడీది అంతా తొండి
– రాష్ట్రానికి రావడమే తప్ప ఇచ్చిందేమీ లేదు
– కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం
– మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం

మొండి చెయ్యి పార్టీని.. చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దుని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్‌ (KTR). మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా చెన్నూరు (Chennur) నియోజకవర్గంలోని మందమర్రిలో మ్యాట్రిక్స్ సంస్థ ఏర్పాటు చేయబోయే పామ్ ఆయిల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. తర్వాత మిషన్ భగీరథ (అర్బన్) కార్యక్రమం ద్వారా మందమర్రి మున్సిపాలిటీలో తాగు నీటి సరఫరాను ప్రారంభించారు.

 Minister KTR Satires On Congress Party

మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇండ్లను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల ద్వారా నిర్మించిన సమ్మక్క-సారలమ్మ మహిళా భవన్ ను స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి ఓపెన్ చేశారు. ఆ తర్వాత మందమర్రి మున్సిపాలిటీలోని షిర్కే కాలనీలో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు.

చెన్నూర్ నియోజకవర్గ టూర్ లో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. వారెంటీ లేని పార్టీ గ్యారెంటీలను నమ్ముదామా? అని ప్రశ్నించారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్‌ కు ఓట్లు వేస్తే 3 గంటల కరెంట్ గ్యారంటీ అన్నారు. సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి రావడం గ్యారంటీ అని, ఆకాశం నుంచి పాతాళం వరకు కుంభకోణాలు జరగడం గ్యారంటీ అని ఎద్దేవ చేశారు.

మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని.. కరెంటు, నీళ్లవ్వక చావగొట్టిన హస్తం.. అలవిగాని హామీలు ఇస్తోందని విమర్శించారు. 150 ఏండ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ గ్యారెంటీ ఎప్పుడో తీరిపోయిందని ఎద్దేవ చేశారు. 60 ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్​.. ఇప్పుడు గ్యారెంటీలు అంటూ ఎన్నికలకు వస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అంటే కన్నీళ్లు, కష్టాలు అని, బీఆర్‌ఎస్‌ అంటే సాగునీళ్లు, సంక్షేమం అని చెప్పారు. రైతు బంధు కేసీఆర్‌ కావాలా? రాబందు కాంగ్రెస్‌ కావాలా? అనేది మీరే నిర్ణయించుకోవాలని చెప్పారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్‌ కావాలా? 3 గల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్‌ కావాలో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.

మోడీ ఎన్ని చెప్పినా తొండి అని, ప్రధాని మనసులో తెలంగాణపై ప్రేమ లేదన్నారు. రాష్ట్రానికి రావడమే తప్ప ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. ఇక, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ప్రశంసలు జల్లు కురిపించారు కేటీఆర్. ఓయూ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్​ కీలక పాత్ర పోషించారని మెచ్చుకున్నారు. ఎన్నికల్లోనూ బాహుబలిని ఎదుర్కొని.. విజయం సాధించారని తెలిపారు. మంత్రులుగా ఉన్నవాళ్లు చేయని పనులను చేసి చూపించారన్నారు. భవిష్యత్తులో సుమన్ మంత్రి అయితే ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment