తెలంగాణ (Telangana)లో ఏ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకున్నారో అదే ప్రభుత్వం వచ్చిందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఫలాన్ని మీ గమ్యానికి చేర్చే బాధ్యత తమదని మంత్రి హామీ ఇచ్చారు.
నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, అష్టా ఐశ్వర్యాలతో వర్ధిల్లేలా భగవంతుడు చల్లాగా చూడాలని కోరుకున్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తే తమ బతుకులు బాగుపడతాయని ప్రజలంతా కలలు కన్నారని తెలిపారు.
అందుకే ప్రజలు పట్టుబట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని మంత్రి వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ మంచి జరిగే విధంగా ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలను ఇచ్చామని తెలిపారు. వాటిని అమలు చేస్తామని వెల్లడించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలు అందరు కాస్త ఓపిక పట్టాలని ఈ సందర్బంగా కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఫలాన్ని ప్రజల గుమ్మం వద్దకు చేర్చే బాధ్యత తమ ‘ప్రభుత్వానిదని అన్నారు. అనంతరం తెలంగాణ ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలను అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.