బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నేరుగా ఎమ్మెల్యే అయి, కేసీఆర్ కొడుకుగా మంత్రి అయ్యావని అన్నారు. ఇప్పుడు మంత్రి పదవి పోగానే మనసన పడతలేదంటూ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ అసమర్థత వల్లనే తొమ్మిదవ ప్యాకేజీ పనులు నిలిచి పోయాయని ధ్వజమెత్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సిరిసిల్ల మున్సిపల్ కరెంట్ బిల్లులను కూడా కేటీఆర్ కట్టలేదన్నారు. చేనేత బిల్లులు కూడా చెల్లించలేదని వెల్లడించారు.
తమ ప్రభుత్వాన్ని చూడలేక కేటీఆర్‌కు కండ్లు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది ప్రజల ప్రభుత్వమని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతానికి మంత్రి వచ్చిన సందర్బంలో ముందస్తులు అరెస్టుల పేరిట అరెస్టు నిర్బంధించే వారని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం స్వేచ్ఛగా సమస్యలను విన్నవించే అవకాశం కల్పించిందన్నారు.
కేటీఆర్ తమ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. కేటీఆర్ విచక్షణ కోల్పోయారని విమర్శించారు. ఆయనకు జ్ఞానం ఉందా అని తీవ్రంగా విరుచుకపడ్డారు. అధికారం శాశ్వతం కాదని.. ఎవరికైనా అహంకారం ఉండకూడదన్నారు. దేశానికైనా.. రాష్ట్రానికైనా కాంగ్రెస్ ప్రభుత్వామే ఎప్పటికీ రక్ష అని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు.