కేంద్ర హోం మంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రానికి అమిత్ షా గురువారం వస్తారని బీజేపీ (BJP) శ్రేణులు వెల్లడించాయి. మధ్యాహ్నం 1.25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారని పేర్కొన్నాయి.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమిత్ షా నేరుగా నోవాటెల్ హోటల్ కు వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 1.40 నుంచి గంట పాటు బీజేపీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి బీజేపీ నేతలను అడిగి ఆయన తెలుసుకోనున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3.05గంలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయానికి అమిత్ షా వెళతారు.
అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ సందర్బంగా అమ్మ వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు అమిత్ షా శంఖారావాన్ని పూరించనున్నారు. ఆ తర్వాత కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్ కు షా చేరుకుంటారి పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ నేతలతో సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నాయి.
ఈ సందర్బంగా రాష్ట్రనేతలకు పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ దిశా నిర్దేశం చేస్తారు. సమావేశం పూర్తయిన అనంతరం అక్కడి నుంచి శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. అనంతరం రెండు సమావేశాల్లో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం 6.50గంటలకు షా ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారని బీజేపీ వర్గాలు చెప్పాయి.