Telugu News » బ్రిటన్, జపాన్ ప్రధానులతో మోడీ ద్వైపాక్షిక చర్చలు…!

బ్రిటన్, జపాన్ ప్రధానులతో మోడీ ద్వైపాక్షిక చర్చలు…!

by admin
modi bilateral talks with rishi sunak and japan pm

జీ-20 సదస్సు సందర్బంగా జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదాతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. జీ-20లో ‘వన్ ఎర్త్’ సెషన్ పూర్తయిన తర్వాత ఇరువురు నేతల మధ్య దైపాక్షిక చర్చలు జరిగినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. భేటీ సందర్బంగా జపాన్ ప్రధానితో దిగిన ఫోటోలను మోడీ షేర్ చేశారు.

modi bilateral talks with rishi sunak and japan pm

 

అంతకు ముందు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతం, పెట్టుబడుల పెంపు గురించి ఇద్దరు ప్రధానులు చర్చించారు. సుస్థిరమైన, సుసంపన్నమైన ప్రపంచం కోసం భారత్, బ్రిటన్ లు కలిసి పని చేస్తాయని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

జపాన్ ప్రధానితో చర్చలు ఫలవతంతమయ్యాయని ప్రధాని మోడీ వెల్లడించారు. భేటీలో ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాల గురించి చర్చించినట్టు పేర్కొన్నారు. భారత్ జీ-20 సమావేశ అధ్యక్షత, జపాన్ జీ-7 ప్రెసిడెన్సీపై ఇరువురం చర్చించామన్నారు. కనెక్టివిటీ, వాణిజ్యం ఇతర రంగాల్లో సహకరించుకునే విషయంపై చర్చలు జరిగాయన్నారు.

సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షున్ని బంగ్లా ప్రధాని షేక్ హసీనా కలిశారు. ఆయనతో పాటు ఆమె కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి సెల్పీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను బంగ్లాదేశ్ హైకమిషన్ షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

జీ-20 సమావేశాల సంయుక్త డిక్లరేషన్ కు లైన్ క్లియర్ అయింది. సమావేశాల ముగింపు సందర్భంగా విడుదల చేసే డిక్లరేషన్ పై ఇప్పటి వరకు ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయంలో భారత్ చాకచక్యంగా వ్యవహరించడంతో చిక్కులు వీడిపోయాయి. లేదంటే మొదటి సారి ఎలాంటి డిక్లరేషన్ లేకుండా జీ-20 సమావేశాలు ముగిసేవి.

ఈ సంయుక్త డిక్లరేషన్ లో ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి అంశాలపై సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు హర్యానాలో షేర్షాల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఉక్రెయిన్ సంక్షోభం గురించి సవరించిన పేరా గ్రాఫ్ చేర్చారు. ఈ ముసాయిదా డిక్లరేషన్‌పై జీ-20 దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.

You may also like

Leave a Comment