Telugu News » Vandhe BHarat: కాచిగూడ- యశ్వంత్‌ పూర్‌ వందే భారత్‌ రైలు ఎప్పటి నుంచి అంటే!

Vandhe BHarat: కాచిగూడ- యశ్వంత్‌ పూర్‌ వందే భారత్‌ రైలు ఎప్పటి నుంచి అంటే!

ఈ నెల 24న ప్రధాని మోడీ మొత్తం 9 వందేభారత్‌లను ప్రారంభించనున్నారు.

by Sai
modi-to-launch-kachiguda-yashwantpur-vande-bharat-express-on-september-24

హైదరాబాద్‌-బెంగళూరు (Hyd-Bengaluru) మధ్య వందేభారత్ (Vande Bharat)రైలు ఈనెల 24న ప్రారంభం కానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ స్టేషన్ల మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా ఈ వందేభారత్‌ రైలును ప్రారంభిస్తారు. ఈ రైలు సోమవారం నుంచి కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.

modi-to-launch-kachiguda-yashwantpur-vande-bharat-express-on-september-24

మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. తిరిగి యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2:45 గంట‌ల‌కు బయల్దేరి.. రాత్రి 11:15 గంట‌ల‌కు కాచిగూడ చేరుకుంటుంది.హైదరాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్‌ ప్రారంభమైతే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది.

ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య అత్యంత వేగంగా రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బెంగళూరు నుంచి 10 గంటల్లో హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ నెల 24న ప్రధాని మోడీ మొత్తం 9 వందేభారత్‌లను ప్రారంభించనున్నారు. ఇందులో విజయవాడ-చెన్నై వందేభారత్‌ రైలు కూడా ఉందని అధికారులు చెప్పారు.

ఈ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. గురువారం మినహా మిగతా అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది. రోజూ ఉదయం విజయవాడలో 5.30 గంట‌ల‌కు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి చెన్నై చేరుకుంటుంది. చెన్నైలో మధ్యాహ్నం 3.20కి బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు తిరిగి వస్తుంది.

You may also like

Leave a Comment