రెండు వరుస డిజాస్టర్ల తర్వాత వచ్చిన చిత్రం అఖండ (Akhanda). బాలయ్య కెరీర్‌కు మళ్లీ ఓ ఊపు తెచ్చిన చిత్రంగా ఈ మూవీని చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి (Veerasimha Reddy) బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం మాంచి జోష్ లో ఉన్న బాలయ్య జైత్రయాత్రలో మరో హిట్ జతకడుతుందా అంటే అవుననే అనుకుంటున్నారట అంతా..
తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా కూడా హిట్ అయ్యిందంటే బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశపడుతున్నారట. ఇక శరవేగంగా విడుదలకు సిద్దం అవుతోన్న నందమూరి నట సింహం కొత్త మూవీ భగవంత్ కేసరి (Bhgavnth Kesari).. అక్టోబర్ 19న రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమాలో బాలయ్యను (Balayya) పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి.
ఈ ఏడాది వీరసింహారెడ్డి వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈవెంట్ లో ఎంతో ఎనెర్జిటిక్ గా ప్రసంగించిన బాలయ్య.. వరంగల్ చరిత్ర గురించి మాట్లాడుతూ తన స్పీచ్ ను ప్రారంభించారు.
కాజల్ (kajal), శ్రీలీల (Sreleela) నటనని బాలయ్య ప్రశంసిస్తూ.. భగవంత్ కేసరి చిత్రంలో కూతురిగా నటించిన శ్రీలీలతో నెక్స్ట్ తన పక్కన హీరోయిన్ గా చేయాలని అన్నారట. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పారట బాలయ్య.. ఏంటి డాడీ.. కుర్ర హీరోయిన్ తో నీకు పనేంటి అన్నారట. నేను హీరోగా వస్తుంటే మీరు నా వయస్సు ఉన్న హీరోయిన్ పక్కన హీరోనా అంటూ మోక్షజ్ఞ నన్ను తిడుతున్నాడని బాలయ్య చేసిన వ్యాఖ్యలు అందరికి తెగ నవ్వులు పూయించాయట.