అపర్ణ గ్రూప్ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (AparnaGroup constructions)కంపెనీ నుంచి భారీగా కాలుష్యం వెలువడుతోందని చెబుతూ 120 మందికి పైగా రంగారెడ్డి జిల్లా నల్లగండ్ల (Nallagandla)లో నిరసన ప్రదర్శనకు దిగారు. కన్ స్ట్రక్షన్ పనుల వల్ల భారీగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు.
కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అపర్ణ గ్రూప్ మాయ మాటలతో వెంచర్ చుట్టూ ఉన్న నిర్మాణాలపై తప్పుడు ప్రకటనలు చేస్తూ ఫ్లాట్ లను విక్రయించిందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అపర్ణ కన్ స్ట్రక్షన్ కంపెనీ పర్యావరణ నియమాలను పాటించడం లేదని చెబుతున్నారు.
అపర్ణ టవర్స్, జికాన్ ల నుంచి వస్తున్న అధిక కాలుష్యం, దుమ్ము, ధ్వని కాలుష్యానికి కారణం అవుతోందంటున్నారు. నల్లగండ్లలో గాలిలో డస్ట్ బాగా వస్తోందని చెబుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, రోడ్ లేనింగ్, తాత్కాలిక పార్కింగ్, కొత్త వస్తున్న న్యూ మాల్‌తో రాబోయే రోజుల్లో ట్రాఫిక్ భయంకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ తామ బాధలను వెల్లడించారు. సిమెంట్, శబ్ద కాలుష్యం వల్ల పొరుగు కమ్యూనిటీల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. కంపెనీలు చట్టాలు పాటించక పోవడం వల్లే ఇలాంటి కాలుష్యాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు.