Telugu News » Forbes : భారత అపర కుబేరునిగా ముఖాశ్ అంబానీ….!

Forbes : భారత అపర కుబేరునిగా ముఖాశ్ అంబానీ….!

గతేడాది ఇన్ ఫ్రా స్ట్రక్చర్ దిగ్గజం గౌతమ్ అదానీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో ఆయన సంపద కరిగి పోయింది.

by Ramu

ఫోర్బ్స్ (Forbes) భారతీయ సంపన్నుల జాబితాలో రిలయన్స్ (Reliance) ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 92 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన మరోసారి భారత్‌లోనే అత్యంత అపర కుబేరుడిగా ఉన్నారు. గతేడాది ఇన్ ఫ్రా స్ట్రక్చర్ దిగ్గజం గౌతమ్ అదానీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో ఆయన సంపద కరిగి పోయింది.

హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో ఆయన సంపద 82 బిలియన్ డాలర్ల నుంచి 68 బిలియన్లకు పడిపోయింది. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఆయన రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశంలోని 100 మంది సంపన్నుల మొత్తం సంపద కలిపి 799 బిలియన్ డాలర్లు ఉన్నట్టు ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. ఇక సాఫ్ట్ వేర్ దిగ్గజం శివ నాడార్ రెండు స్థానాలు ఎగబాకారు.

తాజాగా ఫోర్బ్స్ జాబితాలో ఆయన మూడవ స్థానంలో నిలిచారు. ఇనుము-ఉక్కు దిగ్గజం ఓపీ జిందాల్ అధినేత్రి సావిత్రి జిందాల్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో అవెన్యూ సూపర్ మార్కెట్స్ (డీ మార్ట్ అధినేత) రాధా కృష్ణ దమానీ ఐదవ స్థానంలో నిలిచారు. 20.7 బిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో సైరస్ పూనావాల నిలిచారు.

ఆ తర్వాత 20 బిలియన్ డాలర్లతో హిందూజ ఫ్యామిలీ ఏడవ స్థానంలో ఉంది. ఇక 19 బిలియన్ డాలర్ల సంపదతో దిలీప్ సంఘ్వీ ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. 17.5 బిలియన్ డాలర్లతో కుమార్ బిర్లా తొమ్మిదవ స్థానం, 16.9 బిలియన్ డాలర్లతో షాపూర్ మిస్త్రీ ఫ్యామిలీ ఉంది. ఇక తెలుగు వారిలో మురళి దివీ 6.3 బిలియన్ డాలర్లతో 33వ స్థానంలో వున్నారు.

You may also like

Leave a Comment