Telugu News » Tirupati : మురుగన్‌ దొరికేశాడు!

Tirupati : మురుగన్‌ దొరికేశాడు!

తిరుపతిలో కిడ్నాప్‌నకు గురైన పిల్లాడిని పోలీసులు గంటల వ్యవధిలోనే కనుగొన్నారు.

by Prasanna
murugan

తిరుపతి (Tirupathi) బస్ స్టాండ్ లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకిని పోలీసులు (Police)  గంటల వ్యవధిలోనే కనుగొన్నారు. అభిలాల ప్రాంతానికి చెందిన సుధాకర్ అనేక వ్యక్తి ఈ పిల్లాడిని కిడ్నాప్ (Kidnap) చేసినట్లుగా గుర్తించిన పోలీసులు, ఏర్పేడు మండలం మాధవమాల దగ్గర బాలుడిని స్వాధీనం చేసుకున్నారు.

murugan

తమిళనాడుకి చెందిన అరుల్ రామస్వామి కుటుంబంతో సహా తిరుమల దర్శనానికి వచ్చారు. సోమవారం దర్శనానంతరం తిరిగి తమిళనాడు వెళ్లేందుకు తిరుపతి బస్ స్టాండ్ కు చేరుకున్నారు. అప్పటికే అర్ధరాత్రి దాటడంతో రాత్రికి బస్ స్టాండ్ లోనే కుటుంబంతో సహా నిద్రపోయారు. మధ్యరాత్రిలో మెలుకువ వచ్చి చూసే సరికి తమ చిన్న కుమారుడు మురుగన్ కనిపించకపోవడంతో చుట్టూ వెతికిన తల్లిదండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించారు.

బస్ స్టాండ్ లోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపుచర్యలు చేపట్టిన పోలీసులు బాలుడిని సుధాకర్ అనేక వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. అయితే… రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన సుధాకర్ తన సోదరి ఇంట్లో వదిలిపెట్టి పరారయ్యాడు. దీంతో సుధాకర్ సోదరి నుంచి బాలుడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సుధాకర్ కోసం గాలిస్తున్నారు. అయితే కిడ్నాప్ ఎందుకు చేశాడన్న వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుపతిలో కిడ్నాప్‌నకు గురైన పిల్లాడిని పోలీసులు గంటల వ్యవధిలోనే కనుగొన్నారు. తొలుత తిరుపతి బస్‌స్టాండ్‌లోని  సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన సుధాకర్‌ను గుర్తించారు. అతని కదలికల ఆధారంగా తిరుపతి వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లన్నింటికీ సమాచారం అందించారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పిల్లాడి ఆచూకీని కనిపెట్టగలిగారు. కిడ్నాప్ అయిన బాలుడిని గంటల వ్యవధిలోనే పట్టుకుని తన తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసుల పనితీరుపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment