Telugu News » RSS : ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించేలా ట్రూడో పై ఒత్తిడి తెస్తున్న ఆ సంస్థలు….!

RSS : ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించేలా ట్రూడో పై ఒత్తిడి తెస్తున్న ఆ సంస్థలు….!

ఈ నెల 20న ఈ మేరకు ట్రూడో సర్కార్ ముందు సదరు సంస్థలు నాలుగు డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తోంది.

by Ramu
Muslim org NNCM wants Justin Trudeau to ban RSS in Canada

ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardip singh Nijjar) హత్య నేపథ్యంలో కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పై మరిన్ని చర్యలు తీసుకునేలా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కెనడీయన్ ముస్లిం ( NCCM),వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ (WSO)లు ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ఈ నెల 20న ఈ మేరకు ట్రూడో సర్కార్ ముందు సదరు సంస్థలు నాలుగు డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తోంది.

Muslim org NNCM wants Justin Trudeau to ban RSS in Canada

కెనడాలో భారత దౌత్య వేత్తను బహిష్కరించాలని, భారత్ లోని కెనడా దౌత్య వేత్తను వెనక్కి పిలిపించాలని, భారత్ తో వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ట్రూడో సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అదే విధంగా కెనడాలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( RSS)పై నిషేధం విధించాలని సదరు సంస్థలు ట్రూడోను డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ఏంటీ ఎన్ సీసీఎం సంస్థ…..!

ఒకప్పటి కెనడీయన్ కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లాం రిలేషన్స్ ( CAIR- CAN ) నే ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ముస్లిం (NCCM)గా పిలుస్తున్నారు. సీఏఐఆర్ అనేది యూఎష్ అధారిత ఇస్లామిక్ సంస్థ. దీనికి హమాస్ అనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు వున్నాయనే ఆరోపణలు వున్నాయి. గత జూన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించారు.

ఆ సమయంలో ప్రధాని మోడీకి ప్రత్యేక విందు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నిర్ణయించారు. దీంతో ప్రధాని మోడీతో విందును రద్దు చేసుకోవాలని 17 సంస్థలు జోబైడెన్ కు లేఖ రాశాయి. ఆ సంస్థల్లో ఎన్ సీసీఎం ఉండటం గమనార్హం. తనపై విమర్శలు చేసే వారిని పరువు నష్టం దావాలతో ఇబ్బందులు పెడుతూ ఎన్ సీసీఎం సంస్థ ఫేమస్ అయింది.

ఎన్ సీసీఎంపై ఆరోపణలు…..!

2014లో కెనడియన్ మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జాసన్ మెక్‌డొనాల్డ్ ఎన్ సీసీఎంపై సంచలన విమర్శలు చేశారు. ఎన్ సీసీఎంకు హమాస్ తో సంబంధాలు వున్నాయని ఆయన విమర్శలు చేశారు. దీంతో ఆయనపై ఎన్ సీసీఎం పరువు నష్టం దావా వేసింది. దీంతో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఎన్ సీసీఎంకు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఎన్ సీసీఎం పై మరింత విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఆ తర్వాత తాము ఇద్దరం రాజీ పడినట్టు ఎన్ సీసీఎం, మెక్ డోనాల్డ్ ప్రకటించారు. దీంతో ఆ విమర్శల గురించి అంతా మరిచి పోయారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునేలా గతంలో ఎన్ సీసీఎం, సీఏఐఆర్ సంస్థలు తమకు అనుకూలంగా అధికారులను, పాలకులను లాబీయింగ్ చేశాయని ఆరోపణలు వున్నాయి. వీటిపై గతంలో పలు సంస్థలు ఆందోళనలు కూడా వ్యక్తం చేశాయి.

ఎన్ సీసీఎం, ఇతర ఇస్లామిక్ సంస్థలకు కెనడా సహకారం…!

కెనడాలోని ఇస్లామిక్ సంస్థ NCCM,ఇస్లామిక్ సోషల్ సర్వీసెస్ అసోసియేషన్ (ISSA)తో కలిసి పనిచేసేందుకు కెనడియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (CHRC) అంగీకరించింది. కెనడియన్ ఉపాధ్యాయుల కోసం “భౌగోళిక రాజకీయ హింస, ఇస్లామోఫోబియాకు సంబంధించిన ట్రామాతో బాధపడుతున్న విద్యార్థుకు సహకరించడం’అనే పేరుతో ఓ పుస్తకాన్ని ముద్రించడంలో సహకరించింది. దీని కోసం రెడ్ క్రాస్ నుంచి నిధులను కూడా అందించింది.

ఆ పుస్తకం మొత్తం ఊహజనితంగా సాగిందనే విమర్శలు వినిపించాయి. అందులో కేవలం ముస్లి విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యల గురించి మాత్రమే వివరించారని, వాటి పరిష్కర మార్గాల గురించి వాస్తవిక పరిశోధనను, డేటాను అందించడంలో సంస్థ విఫలమైందని విమర్శలు వినిపించాయి. ఇక జాస్మిన్ జైన్ అనే ప్రొఫెసర్ కు తన రీసెర్చ్ కు ట్రూడో సర్కార్ ఆర్థిక సహాయం అందించడంపై విమర్శలు వచ్చాయి. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాలస్తీనా నిర్వహించిన ఉద్యమంలో ఆమె పాల్గొన్నరనే ఆరోపణలు ఉండటంతో ట్రూడో సర్కార్ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి.

హిందూ వ్యతిరేక శక్తులకు ఎన్ సీసీఎం సహకారం…!

భారత్, హిందువులకు వ్యతిరేకంగా ఎన్సీసీఎం, వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ (WSO)చాలా కథనాలు ప్రచురించాయి. ముఖ్యంగా కెనడా కేంద్రంగా పని చేసే డబ్ల్యూఎస్ ఓ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోదన్న ఆరోపణలు వున్నాయి. ఖలిస్తానీ అనుకూల అంశాలకు ఈ సంస్థ మద్దతిస్తుందన్న ఆరోపణలు వున్నాయి. పౌరసత్వ చట్టాన్ని వివాదాస్పద చట్టంగా డబ్ల్యూఎస్ఓ పేర్కొంది. 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్లకు హిందువులను బాధ్యులుగా చూపిస్తూ నిందించిందని విమర్శలు వచ్చాయి. అలాంటి డబ్ల్యూఎస్ఓతో ఎన్ సీసీఎం సంబంధాలు పెట్టుకోవడం అనుమానాలకు తావిస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment