Telugu News » Crime: కల్లు తాగొద్దన్న భర్త…నలుగురు పిల్లలను కాల్వలో విసిరేసిన భార్య!

Crime: కల్లు తాగొద్దన్న భర్త…నలుగురు పిల్లలను కాల్వలో విసిరేసిన భార్య!

దీనిపై భర్త శరమంద భార్య లలితను మందలించాడు. పలు మార్లు ఈ అలవాటు మానుకోవాలని చెప్పాడు. కానీ లలిత వినిపించుకునేది కాదని స్థానికులు తెలిపారు.

by Prasanna
nagarkurnool

నాగర్‌కర్నూల్‌ జిల్లా (Nagar Kurnool Dist) బిజినేపల్లి మండలానికి చెందిన లలితకు నలుగురు పిల్లలు. అంతా ఏడేళ్లలోపు వారే. ఇందులో ముగ్గురు ఆడపిల్లలు, ఏడు నెలల బాబు ఉన్నారు. లలితకు కల్లు (Toddy) తాగే అలవాటు ఉంది. అది మరింత ఎక్కువై, చివరకు పిల్లలతోనూ (Children) కూడా కల్లు తెప్పించుకుని మరి తాగే స్థాయికి పెరిగింది.

nagarkurnool

దీనిపై భర్త శరమంద భార్య లలితను మందలించాడు. పలు మార్లు ఈ అలవాటు మానుకోవాలని చెప్పాడు. కానీ లలిత వినిపించుకునేది కాదని స్థానికులు తెలిపారు. అయితే తాజాగా భర్త మరో సారి భర్త లలితను కల్లు తాగవద్దని చెప్పి, గేదెలు కాసుకునేందుకు వెళ్లిపోయాడు.

ఆ తర్వాత లలిత తన నలుగురు పిల్లలను తీసుకుని వెళ్లి బిజినేపల్లి పోలీసు స్టేషన్‌లో భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని భర్తకు సమాచారం ఇచ్చి పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పారు.

భర్త వచ్చే వరకు స్టేషన్‌లో ఉండాలని పోలీసులు చెప్పినా ఆమె వినిపించుకోలేదు. పిల్లలను తీసుకొని బిజినేపల్లిలోని కేఎల్‌ఐ కాలువ వద్దకు వెళ్లింది. ఒక్కక్కరిని కాల్వలోకి విసిరేసింది. ఈ ఘటనను కొంతదూరం నుంచి గమనించి కొందరు స్థానికులు అక్కడికి చేరుకొని ఆమెను నిలువరించి పిల్లలను కాపాడేందుకు కాలువలోకి దిగారు. ముగ్గురు ఆడ పిల్లల మృతదేహాలు లభించాయి. శిశువు ఆచూకీ లభించలేదు.

పిల్లల మృతదేహాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తుంటే గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతి చెందిన పిల్లలను మహాలక్ష్మి (7), సాత్విక (5), మంజుల(3) గా గుర్తించిన పోలీసులు, 7 నెలల మగశిశువు  మార్కండేయ గల్లంతైనట్లు తెలిపారు.

తండ్రి శరమంద ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

You may also like

Leave a Comment