టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురైనట్టు నిన్న వార్తలు వచ్చాయి. దీనిపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వార్తల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భద్రతపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేతకు స్టెరాయిడ్లు ఎక్కించేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వైద్యులు, అధికార యంత్రాంగం ఏం దాచేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. చంద్రబాబుకు ఏమైనా హాని జరిగితే దానికి వైఎస్ జగన్ బాధ్యత వహించాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబు ఆరోగ్యానికి తక్షణ ముప్పు ఉందని చెప్పారు.
ఉద్దేశ పూర్వకంగా ఆయనకు హాని తలపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జైల్లో దోమల బెడద, కలుషిత నీరు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు బరువు తగ్గి, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలతో బాధపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు సకాలంలో వైద్య సాయం అందించడం లేదన్నారు. మరో వైపు చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు.
జైలులో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. చంద్రబాబుకు అత్యసర వైద్యం అవసరమన్నారు. జైలులో పరిస్థితులు తన భర్తకు ముప్పు కలిగించేలా ఉందన్నారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును అపరిశుభ్రమై జైల్లో బంధించారన్నారు. దీని వల్ల ఆయన అనారోగ్యానికి ముప్పు వస్తోందన్నారు.
ఇప్పుడు చంద్రబాబుక వైద్య పరమైన జాగ్రత్తలు అవసరమన్నారు. ఆయనకు సరైన సమయానికి మందులు ఇవ్వడం లేదన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన ఐదు కేజీల బరువు తగ్గారని, ఇంకొంచె బరువు తగ్గితే కి్డ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన చెందారు.