Telugu News » Nara Lokesh : చంద్రబాబును చంపేందుకు ప్లాన్!

Nara Lokesh : చంద్రబాబును చంపేందుకు ప్లాన్!

చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు ఆయనకు హాని తలపెట్టేవిగా ఉన్నాయన్నారు.

by admin
Lokesh will also be arrested?

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ జైలులో ఉన్న చంద్రబాబు (Chandrababu) భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన తనయుడు నారా లోకేష్ (Lokesh). జైల్లో చంద్రబాబును చంపేందుకు ప్లాన్ జరుగుతోందన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు ఆయనకు హాని తలపెట్టేవిగా ఉన్నాయన్నారు.

Lokesh will also be arrested?

జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదన్న లోకేష్.. ఇటీవల రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగ్యూ బారిన పడి చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలనేది సైకో కుట్రగా అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు ఏం జరిగినా జగన్​ దే బాధ్యతన్నారు లోకేష్.

చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులోని స్నేహా బ్లాక్‌ లో ఉన్నారు. ఆయనకు స్పెషల్ బాత్‌ రూమ్‌ తో పాటు స్నానం చేసేందుకు రెండు పూటలా వేడినీళ్లు అందిస్తున్నారు. మూడు సార్లు ఫోన్‌ లో మాట్లాడే సౌకర్యం ఇస్తున్నారు. ఆయన వెంట ఓ సహాయకుడితో పాటు ఐదుగురు సిబ్బందిని అనుమతించారు. స్నేహా బ్లాక్‌ లో ప్రత్యేక భద్రత మధ్య ఉంటున్నారు చంద్రబాబు.

రోజూ తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేస్తున్న చంద్రబాబు.. ఆ తర్వాత వాకింగ్ చేస్తున్నారు. ఆపై మెడిటేషన్‌ తో పాటు పేపర్లు తిరగేస్తున్నారు. ఉదయం ఉప్మాను అల్పాహారంగా తీసుకుంటూ బ్లాక్ టీ తాగుతున్నారు. అప్పుడప్పుడు వేడినీళ్లు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం లంచ్‌ కి 100 గ్రాముల బ్రౌన్ రైస్‌ లో ఓ వెజ్‌ కర్రీ తింటున్నారు. సాయంత్రం స్నాక్స్‌ కింద ఫ్రూట్ సలాడ్‌ లేదంటే పుల్కాలో పన్నీర్ కర్రీ, మజ్జిగతో పాటు హాట్‌ వాటర్‌ తీసుకుంటున్నారు. రాత్రి 9 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తున్నారు.

You may also like

Leave a Comment