ఖలిస్తాన్ వేర్పాటు వాద నేత, సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ)నేత గురుపత్వంత్ సింగ్ పన్నూకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) షాక్ ఇచ్చింది. ఛండీఘడ్, అమృత్ సర్ లోని ఫత్వంత్ సింగ్ ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)కింద ఫత్వంగ్ సింగ్ ఆస్తులను జప్తు చేసిట్టు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.
ఫత్వంత్ సింగ్ ఆస్తులను జప్తు చేస్తున్నట్టు చండీగఢ్ లోని సెక్టార్ 15 లోని నివాసానికి అధికారులు నోటీసులు అంటించారు. సిఖ్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుల్లో గురు ఫత్వంత్ సింగ్ పన్నూ ఒకరు. సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కోసం కెనడా వేదికగా యూఎస్, కెనడా, యూరప్ లల్లో ఈ సంస్థ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత వ్యతిరేక ప్రచారాలు చేస్తూ అమాయక సిక్కు యువతను ఉగ్రవాదం వైపు మరల్చేలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
మరోవైపు ఖలిస్తాన్ రెఫరండంను నిర్వహిస్తున్నాడు. పంజాబ్ ను ప్రత్యేక దేశంగా చేయాలనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా వున్న సిక్కుల నుంచి ఓటింగ్ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఖలిస్తాన్ ఉగ్రనేత హర్దీప్ సింగ్ నిజ్జర్ తో కలిసి రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఫత్వంత్ సింగ్ ను 2020 జూలైలో ఉగ్రవాదిగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
ఆ తర్వాత భారత్ లోని అతని ఆస్తులను జప్తు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అతి కఠిన చట్టం ఉపాలోని 51వ సెక్షన్ కింద అతని ఆస్తులను భారత ప్రభుత్వం జప్తు చేసింది. ఇటీవల కెనడాలోని సర్రె ప్రాంతంలో గుర్తు తెలియన వ్యక్తి ఒకరు హర్దీప్ సింగ్ నిజ్జర్ పై కాల్పులు జరిపాడు. దీంతో నిజ్జర్ మరణించాడు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని ఇటీవల కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు.