గత గురువారం నిలోఫర్ ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ ఆరు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా నిందితురాలి ఆచూకీ కనిపెట్టలేకపోయారు పోలీసు అధికారులు.
బాలున్ని కిడ్నాప్ కి కొన్ని గంటల ముందు ఒట్టి చేతుల్తో ఆసుపత్రి లోపలికి నిందితురాలు గుర్తించింది. అనంతరం ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ ఇంటి మీదుగా చిన్నారిని ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్లినట్లు కూడా గుర్తించారని సమాచారం. కాగా బిడ్డని ఎత్తుకెళ్లలానే ముందస్తు ప్లాన్ తోనే ఆగంతక మహిళ నిలోఫర్ ఆసుపత్రిలోకి ప్రవేశించినట్లు తేలింది.
ఎమర్జెన్సీ వార్డులో ఉన్న తన నాలుగేళ్ల కుమారుడి కోసం రెండో బిడ్డని చంకనెత్తుకుని వచ్చిన మహిళ ఫరీదాతో చనువుగా సంభాషించడంతో ఫరీదా బయటకు వెళ్లినప్పుడు ఆ మహిళ చిన్నారిని ఎత్తుకున్నా చుట్టుపక్కల వాళ్లు అనుమానించలేదు.
సెల్ ఫోన్ ను చూపిస్తూ చిన్నారిని ఆడిస్తూన్నట్లు నటిసత్ఊ ఆగంతక మహిళ అక్కడ నుంచి నిష్క్రమించిందని ప్రత్యక్ష సాక్షులు మాటల్ని బట్టి తెలుస్తోంది. కాగా ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పని చేయడం లేదనే వార్తలు అవాస్తవమని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు.
ఐసీయూ బిల్డింగ్ మొత్తం కెమెరాలు ఉన్నాయని, అవన్నీ పని చేస్తున్నాయని చెప్పారు. వాటి ద్వారానే నిందితురాలని గుర్తించగలిగామన్నారు.