హీరో సిద్దార్థ్ (Hero sidharth) కు నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) క్షమాపణ చెప్పారు. సిద్దార్థ నటించిన ‘చిన్న’సినిమా ప్రెస్ మీట్ ను కన్నడ నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ ప్రజల తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్టు ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ట్వీట్ లో ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
‘చిత్త’ సినిమా ప్రచారం కోసం సిద్దార్థ్ బెంగళూరు వచ్చారు. ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడబోయే సమయంలో కొంత మంది కన్నడ సంఘాల నాయకులు అక్కడకు వచ్చారు. వెంటనే ప్రెస్ మీట్ ను ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు కన్నడ నేతలు అడ్డుకుంటుండగానే ప్రెస్ మీట్ లో సిద్దార్థం మాట్లాడే ప్రయత్నం చేశారు.
ప్రెస్ మీట్ ను ఆపి వేయాలని, కావేరి జలాల ఉద్యమానికి మద్దతు తెలపాలని సిద్ధార్థ్ ను కోరారు. పలు మార్లు అడ్డుతగులుతున్న నేపథ్యంలో ప్రేక్షకులకు రెండు చేతులతో నమస్కరించి సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్లి పోయారు. తాజాగా ఈ విషయంపై ప్రకాశ్ స్పందించారు. సమస్య వున్న మాట వాస్తవమేనన్నారు. దీనిపై దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ నాయకులు, పార్టీలను ప్రశ్నించాలన్నారు.
అంతే కానీ ఇలా సామాన్యులు, కళాకారులపై ఒత్తిడి తీసుకు రావడం సరికాదని ఆయన అన్నారు. కర్ణాటకకు చెందిన వ్యక్తిగా ఇక్కడి ప్రజల తరఫున సిద్ధార్థ్ తాను క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. దీనికి రెండు చేతులు జోడించి వున్న ఎమోజీని ఆయన పెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా జరగడం బాధగా వుందంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.