పార్లమెంట్ ఎన్నికల అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్ల అటెన్షన్‌ను తమ వైపునకు తిప్పుకోవడానికి ఎంతో శ్రమిస్తున్నాయి. తెలంగాణలో మే 13 పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) పోలింగ్ జరగనుంది. మొత్తం 17 స్థానాలకు ఒకే రోజు పోలింగ్ ఉండనుంది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు కొల్లగొట్టాలని చూస్తున్నాయి.
అందుకే ప్రచారంలో జోరును పెంచాయి. బీజేపీ మిగతా పార్టీలతో పోలిస్తే ప్రచారంలో దూకుడును కొనసాగిస్తోంది. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. రైతు ఎజెండాతో ఆయన పార్లమెంట్ ఎన్నికల బరితో దిగుతున్నారు. కాంగ్రెస్ అటు ఆరు గ్యారెంటీలు నెరవేర్చేలేక, అభ్యర్థులను ఫైనల్ చేయలేక సతమతం అవుతోంది.
ఈ క్రమంలోనే కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ (Mp bandi sanjay) గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ(Pm MODI) ప్రధాని అయితేనే భారత్‌కు రక్షణ అని అన్నారు. మోడీ కావాలా?, రాహుల్ గాంధీ కావాలా?, కేసీఆర్ కావాలా? తేల్చుకోవాలని ఓటర్లను కోరారు. బండి సంజయ్ పక్కా లోకల్ అని.. కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసులు అని చెప్పారు.
తాను నిరుద్యోగ యువత కోసం కొట్లాడిన వ్యక్తి అని, రైతుల కోసం కొట్లాడి జైలుకి వెళ్లానని చెప్పారు. వందల కేసులు తనపై నమోదయ్యాయన్నారు. తనను ఓడగొట్టడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకలో,నాన్ లోకలోనని అయోమయంలో ఉన్నారని సెటైర్ వేశారు.డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కొనుక్కున్న వ్యక్తి రాజేందర్ రావు అని విమర్శించారు. ‘మా కెప్టెన్ నరేంద్ర మోడీ అని, మరి కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ ఎవరు’ అని ప్రశ్నించారు. ఇక
బీఆర్ఎస్ పార్టీకి ప్లేయర్ లేడు,కెప్టెన్ లేరని ఎద్దేవాచేశారు.