Telugu News » Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం…. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు రూ. 25 వేల పెన్షన్….!

Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం…. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు రూ. 25 వేల పెన్షన్….!

పద్మ శ్రీ కళాకారులకు నెలకు రూ. 25 వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు.

by Ramu
padma shri artists get rs 25 thousand pension says cm revanth reddy

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. ఒక్కో పద్మ శ్రీ అవార్డు ((Padma Awards) గ్రహీతకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. పద్మ శ్రీ కళాకారులకు నెలకు రూ. 25 వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. కవులు, కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల కళాకారులను మరింత ప్రోత్సహిస్తామని వెల్లడించారు.

padma shri artists get rs 25 thousand pension says cm revanth reddy

పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని కాంగ్రెస్ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. అవార్డులతో మట్టిలో మాణిక్యాల ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపారు. చప్పట్లు, దుప్పట్లు కాదు కళాకారులకు నగదు సాయం కూడా అందిస్తామని వెల్లడించారు.

ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమమని వివరించారు. తెలుగు వాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారేనన్నారు. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఒక్కో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు రూ.25 లక్షల ఆర్థిక సాయం, పద్మ శ్రీ కళాకారులకు నెలకు రూ. 25 వేల పెన్షన్ అందిస్తామని తెలిపారు. సంప్రదాయలు, భాషను గౌరవించుకునే విషయంలో మనమంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు.

చిరంజీవి కమిట్ మెంట్ ఉన్న నటుడని చెప్పారు. పున్నమినాగులో ఏ స్థాయిలో నటించారో.. సైరాలోనూ అదే స్థాయిలో నటించారని ప్రశంసల వర్షం కురిపించారు.
వెంకయ్య నాయుడిని సన్మానించడం అంటే మనల్ని మనం సన్మానించుకోవడమేనని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కు అని అన్నారు. రాష్ట్రపతి అయ్యే అన్ని అవకాశాలు వెంకయ్యనాయుడికి ఉన్నాయని తెలిపారు. ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శమని అన్నారు.

 

You may also like

Leave a Comment