పాక్‌లో మైనార్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హిందూ ఆలయాల (Hindu Temples)పై దాడులను ప్రపంచ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గ్లోబల్ చర్మన్ స్వామి విజ్ఞానానంద్ (Swami Vigyananand) ఖండించారు. పాక్‌లో మైనారిటీల ప్రయోజనాలను కాపాడాలని అంతర్జాతీయ సంస్థలను ఆయన కోరారు. పాక్‌లో హిందూ దేవాలయాలపై నిరంతర దాడులు దీర్ఘకాలికంగా ఆ దేశ స్వంత వారసత్వాన్ని నాశనం చేస్తోందన్నారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ హిందూ కాంగ్రెస్‌లో స్వామి విజ్ఞానానంద్ మాట్లాడుతూ…. దేశ విభజన అనంతరం పాక్‌లో మైనార్టీలు నిరంతరం బెదిరింపులకు గురవుతున్నారని చెప్పారు. ముఖ్యంగా హిందువులు, క్రిస్టియన్లలు వేధింపులకు గురవుతున్నారని అన్నారు. హిందువుల సంఖ్య తగ్గిపోతోందని జనాభా లెక్కలను చూస్తే తెలుస్తుందన్నారు.
పాక్‌లో ఇప్పుడు కేవలం ఒకటి లేదా ఒకటిన్నర శాతం కంటే తక్కువ మంది హిందువులు ఉన్నారని తెలిపారు. మైనారిటీల ప్రయోజనాలను కాపాడేందుకు అంతర్జాతీయ హిందూ సమాజాన్ని సమీకరించి బహుళ పాక్షిక సంస్థలపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఆలయానికి రావడం వారసత్వ సంపద అని పేర్కొన్నారు.
ఆ దేవాలయాలన్నింటినీ సరైన రీతిలో పాకిస్తాన్ కాపాడి ఉంటే పిరమిడ్ ల నుంచి ఈజిఫ్టు ఎలా లాభపడింతో ఇప్పుడు పాక్ కూడా అలాగే లబ్ది పొంది ఉండేదన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ మనస్తత్వం, అక్కడి సమాజం తీరు, సమాజంలోని తీవ్రవాదం అనేవి అక్కడి మైనార్టీలకు హాని కలిగిస్తున్నాయన్నారు. పాక్ కేవలం ఆలయాలను ధ్వంసం చేయడంలేదని వారి వారసత్వాన్ని ధ్వంసం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్‌కు దాని స్వంత చరిత్ర లేదా వారసత్వం లేదన్నారు. కాబట్టి దీర్ఘకాలికంగా వారు పాకిస్తాన్‌ను నాశనం చేస్తున్నారని చెప్పారు.