పార్లమెంట్(parliament) ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎనిమిది బిల్లుల(bills)ను కేంద్రం చర్చకు తీసుకు రానుంది. పార్లమెంట్ 75 ఏండ్ల చరిత్ర(History) గురించి ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో పాత పార్లమెంట్‌లో చివరి సారిగా ఉభయ సభలు కొలువుదీరనున్నాయి.
ప్రత్యేక సమావేశాల సందర్బంగా ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ సమవేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
పార్లమెంట్ ను నూతన భవనంలోకి తరలిస్తున్ నేపథ్యంలో ఎంపీలందరికీ నూతన ఐడీ కార్డులను జారీ చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నుంచి నూతన భవనంలో నిర్వహించనున్నట్టు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తెలిపారు. బీజేపీ ఎంపీలు సునీల్ సింగ్, గణేస్ సింగ్ ల నేతృత్వంలోని ప్రివిలైజ్ కమిటీ ఈ రోజు నివేదిక ఇవ్వనుంది.
ఈ సమావేశాల్లో అడ్వకేట్స్( సవరణ) బిల్లు-2023, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆప్ పీరియాడికల్స్ బిల్ -2023, పోస్టాఫీస్ బిల్లు-2023, చీఫ్ ఎలక్షన్ కమిషనర్(నియామకం, సర్వీసు నిబంధనలు, కార్యాలయ నిబంధనల) బిల్లు- 2023, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ బిల్లులపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్టు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.