Telugu News » Shahid Latif : పఠాన్ కోట్ సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం….!

Shahid Latif : పఠాన్ కోట్ సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం….!

పాకిస్తాన్‌లోని సియాల్ కోట్ ప్రాంతంలో లతీఫ్ పై దుండగులు దాడి చేసి చంపినట్టు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

by Ramu
Pathankot attack handler Shahid Latif killed in Pakistan

పఠాన్ కోట్ (Patan Kot) ఉగ్రదాడిలో కీలక సూత్రదారి హతమయ్యాడు. జైషే-ఈ-మహమ్మద్ (JEM)కమాండర్ షహీద్ లతీఫ్ (Shaheed Latif) హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండుగులు లతీఫ్ ను హత్య చేశారు. పాకిస్తాన్‌లోని సియాల్ కోట్ ప్రాంతంలో లతీఫ్ పై దుండగులు దాడి చేసి చంపినట్టు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

Pathankot attack handler Shahid Latif killed in Pakistan

పఠాన్ కోట్ పై దాడి నేపథ్యంలో అతన్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా భారత ప్రభుత్వం ప్రటించింది. సియాల్ కోట్ లోని ఓ మసీదులో ప్రార్థనలు చేస్తుండగా లతీఫ్ పై దాడి జరిగినట్టు పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిషేధ చట్టం (UAPA) లతీఫ్‌పై కేసులు నమోదు చేసి 1994లో అరెస్టు చేసింది. అనంతరం అతన్ని కోర్టు ఎదుట హాజరు పరిచింది.

జైలు శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత 2010లో లతీఫ్ ను వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్ కు పంపించారు. ఆ తర్వాత 1999లో ఇండియన్ ఎయిర్‌‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో కూడా లతీఫ్ కీలక నిందితునిగా వున్నాడు. 2010లో జైలు శిక్ష అనంతరం పాకిస్తాన్ వెళ్లిన తర్వాత అతడు మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలు పెట్టాడని ఎన్ఐఏ వెల్లడించింది.

ఖాసిఫ్ జాన్ తో అతను టచ్ లో వుండే వాడని ఎన్ఐఏ పేర్కొంది. అతనితో పాటు 2016లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి చొరబడిని నలుగురు నిందితులు అతనితో కాంటాక్ట్ లో వున్నారని పేర్కొంది. లతీఫ్ పై ఇంటర్ పోల్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అయితే మిగతా ఉగ్రవాద నాయకుల లాగానే అతను కూడా పాకిస్తాన్ లో స్వేచ్ఛగా సంచరించాని తెలిపింది.

You may also like

Leave a Comment