Telugu News » Jagan : జగన్ పరిస్థితి ఓడి పోయే ముందు హిట్లర్ లాగా మారింది….!

Jagan : జగన్ పరిస్థితి ఓడి పోయే ముందు హిట్లర్ లాగా మారింది….!

వైసీపీకి 175 కాదు15 సీట్లు వస్తే అదే గొప్ప అని ఎద్దేవా చేశారు.

by Ramu
pavan kalyan fire on cm jagan

సీఎం జగన్ (Cm Jagan) పరిస్థితి ఓడిపోయే ముందు హిట్లర్ (Hitler) లాగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వమే వస్తుందని ఆయన అన్నారు. వైసీపీకి 175 కాదు15 సీట్లు వస్తే అదే గొప్ప అని ఎద్దేవా చేశారు.

pavan kalyan fire on cm jagan

అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ…. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని చెప్పారు. కురుక్షేత్ర యుద్ధంలో తాము పాండవులమని, వైసీపీ నేతలు కౌరవులన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమన్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

30 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. 2018 నుంచి డీఎస్సీ ప్రకటన రాలేదని మండిపడ్డారు. డీఎస్సీ కోచింగ్‌కు అవనిగడ్డ ప్రధాన కేంద్రమన్నారు. డీఎస్సీ వేస్తామని జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలీసు ఉద్యోగి కష్ట నష్టాలు తనకు బాగా తెలుసన్నారు. తాము వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటామన్నారు .

ఈ పదేళ్లలో తమ పార్టీ అనేక దెబ్బలు తిన్నదన్నారు. ఆశయాలు, విలువల కోసం తాము పార్టీ నడుపుతున్నామని వెల్లడించారు. యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటానన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటు చీలకూడదని అంటున్నట్టు వివరించారు. మనం, మన పార్టీల కంటే ఈ రాష్ట్ర నేల చాలా ముఖ్యమన్నారు. రాష్ట్ర యువత ఎంతో విలువైన దశాబ్ద కాలాన్ని కోల్పోయారన్నారు .

కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పానన్నారు. మెగా డీఎస్సీ పేరుతో యువతను మోసం చేశారని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎందరికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. వైసీపీ సర్కార్ చెప్పే అభివృద్ధి ఎక్కడ? అని నిలదీశారు.
జగన్ అద్భుతమైన పాలకుడైతే తనకు రోడ్డుపైకి వచ్చే అవసరం లేదన్నారు .

జగన్ వేల కోట్ల అవినీతి చేసినట్లు రుజువైందన్నారు. ఈ దేశ ప్రధానికి జగన్ గురించి తెలియదా? అని నిలదీశారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారన్నారు. అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు. మూడు తరాలుగా రాజకీయాలు చేసే వ్యక్తితో పోరాటం చేస్తున్నానన్నారు.

డబ్బుమీద, నేలమీద తనకు ఎప్పుడూ కోరిక లేదన్నారు. డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. తన నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్‌తో గొడవ పెట్టుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను వెంపర్లాడనన్నారు. వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు. ఓట్లు కొనేందుకు తన దగ్గర డబ్బు లేదన్నారు. బైజూస్‌ను బత్తాయి జ్యూస్‌లా పిండేశారన్నారు. వైసీపీ హయాంలో 3,88 లక్షలమంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారన్నారు .

మీరు చేసిన గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ సర్వే నిజమా.. కాదా.. అని అడిగారు. రాష్ట్రంలో వేల మంది పిల్లలు ఎందుకు చనిపోయారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. యువతకు అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. 20 ఏళ్లు దాటాక సొంతకాళ్లపై నిలబడాలని యువత కోరుకుంటారన్నారు.

నిరుద్యోగి కష్టం తనకు బాగా తెలుసన్నారు. ఉద్యోగం రానివారికి నిరుద్యోగ భృతి ఇప్పించేందుుకు ప్రయత్నిస్తానన్నారు. తాను ఎలాంటి వాడినో పదేళ్లుగా మీరు చూస్తున్నారన్నారు . జీవితంలో కిందనుంచి వచ్చినవారికి ఆత్మగౌరవం ఉంటుందన్నారు. తనపై కేసులు పెడతామంటున్నారన్నారు. దేశభక్తి ఉన్నవారు రాజకీయ నాయకులైతే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు.

You may also like

Leave a Comment