వరల్డ్ కప్ (World Cup)లో వరుస విజయాలతో దూసుకు పోతున్న టీమిండియా (Team India)కు ఫైనల్ మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదురైంది. తుది మ్యాచ్‌లో కంగారుల చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ సారి కప్ టీమిండియాదే అనుకున్న అభిమానులు ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
అటు టీమిండియా ఆటగాళ్లు సైతం తీవ్రమైన బాధలో ఉన్నారు. సగటు భారత అభిమానుల ఆశను నెరవేర్చ లేకపోయినందుకు తీవ్రంగా బాధపడుతున్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజం అనే విషయం తెలిసినప్పటికీ ఓటమిని జీర్ణించుకో లేక పోతున్నారు. అంతకు ముందు మ్యాచ్‌ల్లో కనిపించిన ఉత్సహం ఇప్పుడు వాళ్ల టీమ్ ఇండియా సభ్యుల్లో కనిపించడం లేదు.
ఈ క్రమంలో ప్రధాని మోడీ ఓ ట్వీట్ చేశారు. భారత క్రీడాకారుల టాలెంట్ గొప్పదని అని ఆయన అభినందించారు. వరల్డ్ కప్ పోరులో మీరు చూపించిన మీరు చూపించిన చిత్త శుద్ది నిజంగా అత్యంత విశిష్టమైనదని ఆయన కొనియాడారు. మీరంతా ఒక గొప్ప స్ఫూర్తితో ఆడారని ప్రధాని అన్నారు.
మీరు చూపించిన గొప్ప స్ఫూర్తి దేశానికి గొప్ప గౌరవాన్ని కలిగించిందన్నారు. కేవలం ఈ రోజు మాత్రమే కాదు… ప్రతీ సారి మీకు మద్దతుగా మేము నిలబడతామని వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. దీంతో ప్రధాని మోడీ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. గెలుపులో కాదు ఓటమిలో కూడా అండగా నిలిచే వారే అసలైన నాయకులు అని కొనియాడుతున్నారు.