వికసిత్ భారత్ సంకల్ప యాత్ర (Viksit Bharat Sankalp Yatra) లబ్దిదారులతో ప్రధాని మోడీ (PM Modi) వర్చువల్ గా ముచ్చటించారు. పలు ప్రభుత్వ పథకాల ద్వారా వారు ఎలా లబ్ది పొందారో, పథకాల విషయంలో వారి అనుభవాల ఎలా ఉన్నాయో ఈ సందర్భంగా ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు.
తాజాగా జన ఔషది కేంద్రాలను 10,000 నుంచి 25,000లకు పెంచే కార్యక్రమాన్ని మోడీ ఈ రోజు ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణను సరసమైన ధరలో, సులభంగా అందుబాటులోకి తీసుకు రావడం హెల్తీ ఇండియా ముఖ్య ఉద్దేశం. సరసమైన తక్కువ ధరలకు ఔషధాలను అందుబాటులో ఉంచడానికి జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ పథకంలోని ముఖ్య కార్యక్రమాల్లో ఒకటి.
ఇదే కార్యక్రమంలో ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ డ్రోన్ పథకం గురించి చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ ఇది అనేక ఇతర మహిళా ఆధారిత సంక్షేమ కార్యక్రమాల లాగానే మహిళలకు సాధికారతనిస్తుందని రుజువు చేసిందని ప్రధాని వెల్లడించారు.
ఈ కార్యక్రమం కింద, మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జి) డ్రోన్‌లు అందించబడతాయి,. వీటిని వారు జీవనోపాధి కోసం ఈ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా డ్రోన్లను ఎగురవేయడం, వాటిని ఉపయోగించే విధానంపై మహిళకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.