యూపీ వారణాసిలోని నమో ఘాట్ వద్ద కాశీ -తమిళ్ సంగమం (Kashi Tamil Sangamam) రెండవ ఎడిషన్ (Second Edision)ను ప్రధాని మోడీ (PM Modi) ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారణాసి-కన్యాకుమారి మధ్య ప్రయాణించే కాశీ-తమిళ సంగమం ఎక్ప్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రధాని మోడీ ప్రారంభించారు. కాశీ తమిళ సంగమాన్ని ఈ నెల 17 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు.
తమిళనాడు, పుదుచ్చేరి నుంచి వచ్చిన సుమారు 1`400 మందికి పైగా ప్రముఖులు ఈ కాశ తమిళ సంగమంలో పాల్గొననున్నారు. ఆ ప్రముఖులు వారణాసి, ప్రయాగ్ రాజ్, అయోధ్య నగరాల్లో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో కూడిన తమిళ ప్రతినిధుల మొదటి బ్యాచ్ ‘గంగా’ఆదివారం వారణాసికి చేరుకుంది.
మిగిలిన ఆరు బందాలు టీచర్ల బృందం (యమునా), ప్రొఫెషనల్స్ (గోదావరి), ఆద్మాత్మికవేత్తల బృందం(సరస్వతి), రైతులు, కళాకారుల బృందం(నర్మదా), రచయితలు(సింధూ), వ్యాపారవేత్తలు(కావేరి) కూడా వారణాసి చేరుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. తమిళనాడు, కాశీ ప్రాంతాలకు చెందిన కళ, సంగీతం, చేనేత, హస్తకళలు, వంటకాలు, ఇతర విలక్షణమైన ఉత్పత్తులను ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
సాంస్కృతిక, పర్యాటకం, రైల్వేలు, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఐఆర్ సీటీసీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంబంధిత శాఖల మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నారు. దీనికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది.
కాశీ తమిళ సంగమంలో సాహిత్యం, ప్రాచీన గ్రంథాలు, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, సంగీతం, నృత్యం, నాటకం, యోగా, ఆయుర్వేదం గురించి పలువురు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దీంతో పాటు పలు రంగాల్లో ఆవిష్కరణలు, వాణిజ్యం, విద్య, తర్వాత తరం టెక్నాలజీపై సెమినార్లను ఈ సమవేశాల్లో నిర్వహించనున్నారు.