లోక్ సభ (Loke Sabha) లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Reservation Bill )కు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ప్రధాని మోడీ (PM MOdi) ధన్యవాదాలు తెలిపారు. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే “నారీ శక్తి వందన్ అధినియం” బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటం దేశానికి బగారు క్షణాలని (Golden Movements)అని అన్నారు.
ఈ బిల్లు దేశంలో నారీ శక్తిని మరింత శక్తివంతం చేస్తుందన్నారు. దీంతో మహిళలు మరింత బాధ్యతను చేపట్టగలరని తెలిపారు. ఈ పుణ్యకార్యానికి సభ్యులందరూ, సంపూర్ణ మద్దతు తెలిపారని చెప్పారు. ఈ విషయంలో సభ్యులందరికీ తాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపినందుకు అందరిని అభినందిస్తున్నానన్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ నిన్న ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ఓటింగ్‌లొ 456 మంది ఓటు వేశారు. అందులో 454 మంది బిల్లుకు అనుకూలంగా, ఏఐఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో బిల్లు ఆమోదం పొందినట్టు లోక్ సభ స్పీకర్ వెల్లడించారు.
లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. లోక్‌సభలొ ఈ రోజు ‘నారీ శక్తి వందన్ అధినియం’ను ఆమోదించడంతో మన దేశానికి ఇది చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అభివర్ణించారు.అనంతరం అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. నరేంద్ర మోడీజీ మహిళా సాధికారత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారని పేర్కొన్నారు.