Telugu News » Ayodhya : అయోధ్య మహాద్భుతం.. అడుగడుగునా సాంస్కృతిక వైభవం

Ayodhya : అయోధ్య మహాద్భుతం.. అడుగడుగునా సాంస్కృతిక వైభవం

ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. సంక్రాంతి తర్వాత ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించి.. 10 రోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు.

by admin

అయోధ్య (Ayodhya) రామ మందిరం.. హిందువుల దశాబ్దాల కల. ఇంకొన్ని రోజుల్లో ఇది సాకారం కానుంది. ఆలయ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అడుగడుగునా భారతీయ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా శిల్ప కళాకారులు తీర్చి దిద్దుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ (Shri Ram Janmbhoomi Teerth Kshetra) తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఆలయాన్ని చూసి జై శ్రీరామ్ (Jai Sriram) అంటూ నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

PM Modi to attend inauguration of Ram Mandir 1

సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య రామ మందిరం

‘500 ఏళ్ల పోరాటానికి ముగింపు’ అనే క్యాప్షన్‌‌ తో ఈ వీడియోను పోస్ట్ చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌. 30 సెకెన్ల నిడివి కలిగి ఉన్న ఈ వీడియోలో రామ మందిరంలో శిల్పాలకు తుది మెరుగులు దిద్దుతున్నట్టు కనిపిస్తోంది. ఫ్లోరింగ్‌, గోపురం, ద్వారాలు, స్తంభాలతోపాటు మందిర నిర్మాణానికి ఉపయోగించిన భారీ యంత్రాలను కూడా చూడొచ్చు.

PM Modi to attend inauguration of Ram Mandir 2

ఆలయం లోపల తుది మెరుగులు దిద్దుతున్న శిల్ప కళాకారులు

మూడంతస్తుల్లో నిర్మిస్తున్న అయోధ్య రామాలయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ పనులు డిసెంబర్‌ (December) నాటికి పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ తెలిపింది. మందిరంలో దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి 4 వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు చెప్పింది. ప్రారంభోత్సవం జనవరి (January) 22న జరగనుంది. సంక్రాంతి తర్వాత ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించి.. 10 రోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు.

PM Modi to attend inauguration of Ram Mandir 6

అడుగడుగునా భారతీయ సాంస్కృతిక వైభవం

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ నిర్వాహకులు ఆహ్వాన లేఖను అందజేశారు. ఈ ఆహ్వానం తనకు అందడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇది గొప్ప ఆశీర్వాదం అని వ్యాఖ్యానించారు. తన జీవిత కాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం గొప్ప అదృష్టమని చెప్పారు. 2020 ఆగస్టులో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.

PM Modi to attend inauguration of Ram Mandir 5

PM Modi to attend inauguration of Ram Mandir 3

PM Modi to attend inauguration of Ram Mandir 4

PM Modi to attend inauguration of Ram Mandir

You may also like

Leave a Comment