ప్రధాని మోడీ (PM modi) ఈ రోజు ఉత్తరాఖండ్ (UtharKhand)లో పర్యటించారు. పిత్తోర్ గఢ్లో హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం గౌరీ కుంద్ ను ఆయన సందర్శించారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆది-కైలాష్ ఆశీర్వాదాన్ని ప్రధాని మోడీ తీసుకున్నారు. పూజ సందర్బంగా అక్కడి ఆదివాసీల ప్రత్యేక సాంప్రదాయ దుస్తులను ప్రధాని మోడీ ధరించారు.
ప్రధాని మోడీ తలపై టర్బన్ ధరించి, శరీరంపై రాంగా( శరీరంప వేసుకునే వస్త్రం) ధరించి హారతి ఇచ్చారు. ఈ సందర్బంగా ఆలయ విశిష్టత గురించి అక్కడి పూజారాలు విరేంద్ర కుతియాల్, గోపాల్ సింగ్ ప్రధాని మోడీకి వివరించారు. దేవి భూమి సందర్శన పై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పిత్తోర్ గఢ్లో తాను ఈ రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. పార్వకుంద్ నుంచి ఆయన గుంజి గ్రామానికి బయలు దేరారు. అక్కడ స్థానికులను ప్రధాని మోడి కలుసుకున్నారు. వారితో పాటు కాసేపు ముచ్చటించారు.
గుంజిలో స్థానికుల తయారు చేసిన వస్తువులు, కళాఖండాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కలిసి ప్రధాని మోడీ ఎగ్జిబిషన్ ను తిలకించారు. అక్కడి నుంచి జగేశ్వర్ ధామ్ కు ప్రధాని మోడీ వెళ్లారు. అక్కడ జ్యోతిర్లింగ ఆలయం చుట్టూ ప్రధాని మోడీ ప్రదక్షణలు చేశారు. అక్కడ కాసేపు ధ్యానం చేశారు.