టైలర్ ( Tailer) కన్హయ్య లాల్ (Kanhaiah Lal) హత్య కేసులో కాంగ్రెస్ (Congress) ఓటు బ్యాంకు (Vote Bank) రాజకీయాలకు పాల్పడిందని ప్రధాని మోడీ ఆరోపించారు. గడిచిన ఐదేండ్లలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నాశనం చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేర జాబితాలో రాజస్థాన్ రాష్ట్రం టాప్ లో వుండటం తనను తీవ్రంగా బాధించిందన్నారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు అత్యధికంగా రాజస్థాన్ నుంచే నమోదవుతున్నాయని చెప్పారు.
రాజస్థాన్‌లోని చిత్తోర్ ఘడ్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. గత ఏడాది జూన్‌లో ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ హత్యను గుర్తు చేశారు. ఈ హత్య విషయంలో రాజస్థాన్ సర్కార్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ హత్య విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయ్‌పూర్‌లో ఏం జరిగిందో అసలు ఎవరూ ఊహించలేదన్నా. బట్టలు కుట్టించు కుంటామని చెప్పి ఇద్దరు వ్యక్తులు టైలర్ కన్హయ్య గొంతు కోసి హత్య చేశారని చెప్పారు. ఉదయపూర్ టైలర్ హత్య సమయంలో ఆ పార్టీ ఏమి చేసింది? అని తాను ప్రశ్నించాలని అనుకుంటున్నానన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని ఫైర్ అయ్యారు.
రాజస్థాన్‌లో నేరాల సంఖ్య బాగా పెరిగిపోయిందన్నారు. అందుకే బీజేపీ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నట్టు తెలిపారు. రాజస్థాన్ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అయినప్పటికీ వాళ్లు ప్రభుత్వాన్ని నడపటంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.