రాష్ట్రంలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలను చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్లను కూడా బదిలీ చేసింది. తాజాగా రాష్ట్రంలో పోలీసు శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది.
తాజాగా రాష్ట్రంలో మరో 62 మంది డీఎస్పీలను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్లో పలువురు ఏసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న డీఎస్పీలకు తాజాగా పోస్టింగులను ప్రభుత్వం ఇచ్చింది.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 300 పైగా డీఎస్పీలకు రేవంత్ రెడ్డి సర్కార్ స్థాన చలనం కలిగించింది. రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. డీఎస్పీలతో పాటుగా హైదరాబాద్లో పలువురు ఏసీపీలను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది.
ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఇది ఇలా వుంటే ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఇటీవలే పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని భారీగా బదిలీలు చేసింది. మొత్తం 395 మంది ఎంపీడీవోలకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది.